News September 1, 2025

భీమవరం: పీజీఆర్ఎస్‌కు 210 అర్జీలు

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రజల నుంచి 210 అర్జీలను స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ పరిధిలో లేని అర్జీలను సైతం సంబంధిత శాఖలకు పంపించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

Similar News

News September 3, 2025

ఉల్లి రైతులను ఆదుకోవాలి: జేసీ

image

జిల్లాలోని వివిధ విద్యాసంస్థలు, వసతి గృహాల వంటకాలలో కర్నూలు ఉల్లి వినియోగించి కష్టకాలంలో ఉన్న ఉల్లి రైతులను ఆదుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ అన్నారు. భీమవరం జిల్లా కలెక్టరేట్లో మంగళవారం కర్నూలు ఉల్లి వినియోగంపై ఆర్డీవోలు, తహశీల్దార్లు, విద్యాసంస్థల యాజమాన్య ప్రతినిధులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. కర్నూలు, నంద్యాల ఉల్లిపాయలు అకాల వర్షాలు కారణంగా దెబ్బతిన్నాయని అన్నారు.

News September 3, 2025

పెనుమంట్ర: ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన గీతాబాయి

image

పెనుమంట్ర మండలం ఆలమూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యశాఖ అధికారిణి డాక్టర్ గీతాబాయి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించి, అనంతరం ఆశా వర్కర్లతో సమావేశమయ్యారు. రోగులకు ఇబ్బందులు లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని ఆమె అధికారులను ఆదేశించారు.

News September 2, 2025

జాతీయ అవార్డుకు మంచిలి ఉపాధ్యాయుడు ఎంపిక

image

మంచిలి జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నేలపాటి వెంకటరమణ జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. విద్యారంగంలో ఆయన చేసిన విశేష కృషికిగాను న్యూఢిల్లీకి చెందిన గ్లోబల్ టీచర్స్ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ నెల 16న న్యూఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి సెమినార్‌లో వెంకటరమణకు ఎన్‌టీఈఈ అవార్డును అందజేయనున్నారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ప్రధానోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.