News April 10, 2025
భీమవరం పొలాల్లో చెట్టుకి వేలాడుతున్న మృతదేహం

ఇంకొల్లు మండలం భీమవరం గ్రామంలోని శేషాయిగుంట పొలాల్లో చెట్టుకి యువకుడి మృతదేహం వేలాడుతున్న ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల మేరకు.. ఓ గొర్రెల కాపరి గమనించి గ్రామపెద్దలకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టి యువకుడు పోలూరు మహేశ్ (27)గా గుర్తించారు. మృతుడికి సంవత్సరం కిందట వివాహమైంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 18, 2026
భార్యకు ఎమోషనల్ విషెస్ తెలిపిన మెగాస్టార్

‘నా విజయ రహస్యం నీవే’ అంటూ భార్య సురేఖకు మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్‌గా బర్త్ డే విషెస్ తెలియజేశారు. 1980 ఫిబ్రవరి 20న వివాహ బంధంతో మొదలైన తమ ప్రయాణంలో భార్యే తన అతిపెద్ద శక్తి అని కొనియాడారు. ‘కుటుంబ బాధ్యతలన్నీ సురేఖ చూసుకోవడం వల్లే నేను వృత్తిపై దృష్టి పెట్టగలిగా. నా తల్లిదండ్రులకు ఆమె సొంత కూతురిలా నిలిచింది. సంక్షోభంలో, సంతోషంలో అండగా నిలిచిన సురేఖకు హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.
News February 18, 2026
రేపు వేల్పూరులో పర్యటించనున్న YS షర్మిల

ఉపాధిహామీ పథకంపై ప్రజాభిప్రాయ సేకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమం చేపట్టింది. దీంతో శావల్యాపురం మండలం వేల్పూరుకు AICC అధ్యక్షురాలు YS షర్మిల గురువారం రానున్నట్లు వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ రామాంజనేయులు తెలిపారు. BJP ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. రాష్ట్రాలపై అదనపు భారం మోపుతోందని విమర్శించారు. దీంతో రాష్ట్రాల అభివృద్ధి పూర్తిగా కుంటుపడే ప్రమాదముందన్నారు.
News February 18, 2026
వరంగల్: HCA జట్టులో కృష్ణవేణికి చోటు

వరంగల్ క్రీడాకారిణి కృష్ణవేణి ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. మహిళల క్రికెట్ జట్టులో బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్‌లో రాణించిన కృష్ణవేణి HCA సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి, నేటి నుంచి రాంచీ స్టేడియంలో BCCI నిర్వహిస్తున్న వన్-డే మహిళల టోర్నీలో HCA జట్టులో చోటు దక్కించుకుంది. పోటీల్లో బెస్ట్-11 తుది జట్టులో కృష్ణవేణి చోటు దక్కించుకోవడం పట్ల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


