News August 10, 2025

భీమవరం: పోలీస్ క్రికెట్ లీగ్‌ను ప్రారంభించిన ఎస్పీ

image

పోలీసుల ఒత్తిడిని తగ్గించి, మానసిక ఉల్లాసాన్ని పెంచేందుకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఆదాన్ నయీమ్ అస్మి తెలిపారు. భీమవరం డీఎన్‌ఆర్ కళాశాల క్రీడా మైదానంలో శనివారం పోలీసు క్రికెట్ లీగ్‌ను ఎస్పీ ప్రారంభించారు. విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడిని దూరం చేయడానికి క్రీడలు ఉత్తమ సాధనమని ఎస్పీ అన్నారు. ఈ లీగ్‌లో జిల్లా నుంచి నాలుగు జట్లు పాల్గొంటున్నాయి.

Similar News

News August 10, 2025

తణుకు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

తణుకు శివారు ఇరగవరం రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున ఉండ్రాజవరం మండలం పసలపూడికి చెందిన కత్తుల చక్రధరరావు (30) మృతి చెందాడు. మోటార్ సైకిల్‌పై వెళుతుండగా పంట బోదెలో పడి ఉండటం, తల పగిలి ఉండటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News August 9, 2025

భీమవరం: అభివృద్ధి పనులు పరిశీలించిన కలెక్టర్

image

భీమవరం పట్టణంలోని గాంధీ సర్కిల్లో దాత పోతూరి బాపిరాజు చేపట్టిన అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ నాగరాణి ఆకస్మికంగా పరిశీలించారు. గాంధీజీ విగ్రహం ప్రాంగణంలో లాన్, మొక్కలు, వాటర్ ఫౌంటెన్, పెయింటింగ్ పనుల పురోగతిపై ఆమె ఆరా తీశారు. ఆగస్టు 15 నాటికి ఈ పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.

News August 9, 2025

తణుకులో కొనసాగుతున్న జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు

image

జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు రెండో రోజు శనివారం తణుకులో నిర్వహించారు. అర్చరీ, అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, హాకీ క్రీడల పోటీలలో జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. అర్చరీలో జోనల్ స్థాయి పోటీలకు 24 మందిని ఎంపిక చేశారు.