News March 31, 2026

భీమవరం: బాలికపై లైంగిక దాడి.. 20ఏళ్ల జైలు..!

image

8ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి భీమవరం పోక్సో కోర్టు జడ్జ్ బీ.లక్ష్మీనారాయణ 20ఏళ్ల జైలు శిక్ష విధించారు. కాళ్ల మండలం దొడ్డనపూడి గ్రామంలో 2021లో జరిగిన ఈ ఘటనపై కాళ్ల పోలీసు స్టేషన్లో అప్పట్లో పోక్సో కేసు నమోదైంది. విచారణ అనంతరం నేరస్థుడికి కఠిన కారాగార శిక్షతోపాటు రూ.15వేల జరిమానా విధించారు. బాధితురాలుకి రూ.50,000ల నష్టపరిహారం చెల్లించాలని న్యాయమూర్తి తుది తీర్పును వెలువరించారు.

Similar News

News April 20, 2026

తణుకు: ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్య

image

తణుకు మండలం పైడిపర్రుకు చెందిన అనుమోలు దేవి(31) సోమవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త పిల్లలను స్కూలుకు తీసుకెళ్లిన సమయంలో ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందగా, ఎస్సై జానా సతీశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

News April 20, 2026

భీమవరంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

image

భీమవరం చినమిరం ప్రాంతంలో అక్రమంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి అందిన సమాచారంతో సీఐ కాళీ చరణ్ నేతృత్వంలో దాడులు నిర్వహించి, నిందితుల నుంచి రూ.23,160 నగదును స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

News April 20, 2026

10 గంటల నుంచి పీజీఆర్ఎస్: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల్లో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 ని.ల వరకు ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించవచ్చన్నారు. దూర ప్రాంతాల వారు 1100 టోల్ ఫ్రీ నంబర్, https://Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు.