News January 21, 2026

భీమవరం: మావుళ్లమ్మ తల్లి స్వర్ణ వస్త్ర నిధికి బంగారం అందజేత

image

భీమవరంలో కొలువైన శ్రీమావుళ్లమ్మ అమ్మవారికి పట్టణానికి చెందిన భరత్ కుమార్, వరలక్ష్మీ నాగప్రసన్న 8 గ్రాముల అమ్మవారి స్వర్ణ వస్త్ర నిధికి విరాళంగా అందజేశారు. ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ నాగభూషణం, ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగర్ పాల్గొన్నారు.

Similar News

News January 30, 2026

ప.గో: వశిష్ఠ గోదావరి తీరంలో మృతదేహం కలకలం

image

నరసాపురం పట్టణంలోని వశిష్ఠ గోదావరి తీరం లలిత ఘాట్ సమీపంలో శుక్రవారం ఉదయం గుర్తుతెలియని మగ మృతదేహం లభ్యమైంది. నది ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఈ మృతదేహం పూర్తిగా ఉబ్బిపోయి ఉండటంతో, సదరు వ్యక్తి రెండు, మూడు రోజుల క్రితమే నీటిలో మునిగి మృతి చెంది ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి గుర్తింపు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

News January 30, 2026

ప.గో: పాత కక్షలతో ఇరు వర్గాల ఘర్షణ.. 13 మందిపై కేసు!

image

అత్తిలి మండలంలోని ఎర్ర నీలిగుంట గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో పెచ్చేటి శ్రీనివాసరావు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణ కలకలం రేపింది. ఈ నెల 28న ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు దిగగా, బాధితుల ఫిర్యాదు మేరకు మొత్తం 13 మందిపై కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలో శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు నిఘా పెంచారు. కక్షలు వీడి సామరస్యంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

News January 30, 2026

కుష్టు నివారణే లక్ష్యంగా ‘స్పర్శ’ అవగాహన: కలెక్టర్

image

గాంధీజీ వర్ధంతిని పురస్కరించుకొని ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు జిల్లావ్యాప్తంగా కుష్టు వ్యాధి నివారణ పక్షోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ‘స్పర్శ’ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో సర్పంచ్‌లు, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది ప్రతిజ్ఞ చేయాలని ఆదేశించారు. వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించి, కుష్టు రహిత సమాజం కోసం కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.