News August 8, 2025
భీమవరం: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్‌లో నర్సాపూర్-లింగంపల్లి ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి సుమారు 50 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తల, మొండెం వేరయ్యాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసినవారు రైల్వే పోలీసులను సంప్రదించాలని ఎస్సై సుబ్రహ్మణ్యం కోరారు.
Similar News
News August 31, 2025
రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి: కలెక్టర్

రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో శనివారం వివిధ శాఖాల అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. రీ సర్వే, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, పిజిఆర్ఎస్ ఫిర్యాదులు, రైస్ కార్డులు, క్యాస్ట్ వెరిఫికేషన్, కోర్టు కేసులు అంశాలపై జిల్లాలోని ఆర్డీవోలు, తహశీల్దారులు మండల సర్వేలతో సమీక్షించారు.
News August 30, 2025
శిశుమరణాలపై వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్ష

తల్లి మరణిస్తే ఆ కుటుంబం అంతా ఎంతో ఇబ్బందులకు గురవుతుందని, జిల్లాలో మాతా శిశు మరణాలు జరగకుండా వైద్యులు అత్యంత అప్రమత్తతో చికిత్సలను అందజేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి స్పష్టం చేశారు. శనివారం జిల్లా కలెక్టరేట్లో వైద్య సిబ్బందితో జరిగిన సమీక్షలో మాట్లాడారు. కాగా.. జిల్లాలో ఈ ఏడాది జూలై నెలాఖరు వరకు ఆసుపత్రులలో రెండు మాతృ మరణాలు, నాలుగు శిశుమరణాలు నమోదయ్యాయి.
News August 30, 2025
ఇండెక్స్ వెర్షన్ 2.0పై ఒక్కరోజు వర్క్ షాప్: కలెక్టర్

భీమవరం: కలెక్టరేట్లో పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో “పంచాయతీ అడ్వాన్స్‌మెంట్ ఇండెక్స్ వెర్షన్ 2.0 పై ఒక్కరోజు వర్క్ షాప్ శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. జిల్లా సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధనకు సంబంధిత శాఖలు సమిష్టిగా కృషి చేయాలన్నారు. సుస్థిర అభివృద్ధి అనేది మానవ, సామాజిక, ఆర్థిక అంశాలపై ఆధారపడి ఉందన్నారు.