News October 22, 2025

భీమవరం DSP పై పవన్ సీరియస్.. హోం మంత్రి స్పందన

image

భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహార శైలికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ నివేదికను కోరిన విషయం తెలిసిందే. దానిపై హోంమంత్రి అనిత స్పందించారు. డిప్యూటీ సీఎంగా పవన్ డీజీపీని నివేదిక అడగడంలో ఎలాంటి తప్పులేదని, తనకు వచ్చిన సమాచారాన్ని పవన్ వెల్లడించడంలో తప్పేముందని ప్రశ్నించారు. కాగా డీఎస్పీ పరిధిలో పేకాట స్థావరాలు పెరగడం, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ ఫిర్యాదులు అందాయని పవన్ అన్నారు.

Similar News

News October 22, 2025

రాణీ అహల్యాబాయి.. అందరికీ ఆదర్శం

image

మాల్వాను పాలించిన రాణీ అహల్యాబాయి హోల్కర్ ఆదర్శ పాలకుల్లో ఒకరు. 1754లో జరిగిన కుంభేర్ యుద్ధంలో భర్త ఖండేరావు, 1767లో కుమారుడు మలేరావు మరణించడంతో 1795 వరకు ఇండోర్‌ను పాలించారు. అహల్యాబాయి పాలనాకాలం మరాఠా సామ్రాజ్యపు స్వర్ణయుగంగా గుర్తింపు పొందింది. ఎన్నో ప్రసిద్ధ హిందూ దేవాలయాలను ఆమె పునరుద్ధరించారు. అహల్యాబాయి కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం ఈమె పేరిట స్త్రీ శక్తి పురస్కారాన్ని నెలకొల్పింది.

News October 22, 2025

వనపర్తిలో ఈనెల 24న మెగా జాబ్ మేళా

image

ఈనెల 24న వనపర్తిలోని రామాలయం దగ్గర ఉన్న PMKK సెంటర్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మహమ్మద్ జానీ పాషా తెలిపారు. జాబ్ మేళాకు హాజరయ్యి అభ్యర్థులు తప్పనిసరిగా 10, ఇంటర్, డిగ్రీ కలిగి ఉండాలన్నారు. హైదరాబాద్ జడ్చర్ల వనపర్తిలోని కంపెనీలలో ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 97012 00819 నంబర్ సంప్రదించాలన్నారు.

News October 22, 2025

RMLIMSలో 422 నర్సింగ్ పోస్టులు

image

డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్ (RMLIMS) 422 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్సీ నర్సింగ్, డిప్లొమాతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అర్హులు. 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. నవంబర్ మొదటి లేదా రెండో వారంలో దరఖాస్తు లింక్ ఓపెన్ కానుంది. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.drrmlims.ac.in/