News December 28, 2025

భీమిలికి పెరుగుతున్న వలసలు

image

భీమిలిలో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని ప్రభుత్వం చెబుతుంటే.. వలస పక్షులు వాలుతున్నాయి. ఇంతకాలం పిల్లల చదువుల కోసం స్టీల్ సిటీకి వచ్చేవారు. ఇప్పుడు ఉపాధి పెరుగుతుండడంతో వలసలు మొదలయ్యాయి. ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, ఐటీ పురోగతి పెరగడంతో మైగ్రేషన్‌ పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో మొదటి రెండు స్థానాల్లో భీమిలి, గాజువాక నిలిచాయి.

Similar News

News December 28, 2025

విశాఖ కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం రెవెన్యూ క్లీనిక్: కలెక్టర్

image

విశాఖ కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్‌లో రెవెన్యూకు సంబంధించిన అర్జీల విషయమై రెవెన్యూ క్లీనిక్‌ను నిర్వహించనున్నారు. డిసెంబర్ 29వ తేదీ నుంచి ప్రతీ సోమవారం ఈ కార్యక్రమం ప్రత్యేకంగా చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో గల అందరు రెవెన్యూ డివిజినల్ అధికారులు, ఎమ్మార్వోలు పాల్గొననున్నారు. అర్జీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సూచించారు.

News December 28, 2025

విశాఖలో వ్యభిచార గృహంపై దాడి

image

విశాఖ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధి జ్యోతి నగర్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం రావడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం సాయంత్రం దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు విటులు జ్యోతిష్, హర్షిత్‌ని అరెస్ట్ చేసి ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. వారిపై కేసు నమోదు చేసి విటులను, నిర్వాహకురాలిని రిమాండ్‌కి తరలించారు.

News December 28, 2025

విశాఖ సీపీకి డీజీగా పదోన్నతి

image

విశాఖ సీపీగా విధులు నిర్వహిస్తున్న శంఖబ్రత బాగ్చీకి డీజీగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ కార్యదర్శి కే.విజయానంద్ శనివారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. 1996 బ్యాచ్‌కి చెందిన శంఖబ్రత బాగ్చీ పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం విశాఖలో సీపీగా సేవలందిస్తున్నారు. కమిషనర్ రాకతో పోలీసుల సంక్షేమానికి, అభివృద్ధికి, ప్రజోపకార పనులు చేశారు.