News April 25, 2024
భీమిలిలో గంటా శ్రీనివాస్ పేరిట మరో అభ్యర్థి నామినేషన్

భీమిలిలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాస రావు పోటీచేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదే పేరుతో మరో వ్యక్తి భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. గురువారం భీమిలి ఆర్డీవో కార్యాలయంలో జాతీయ జనసేన పార్టీ తరఫున గంటా శ్రీనివాస రావు అనే వ్యక్తి నామినేషన్ దాఖలు చేశారు. మరి పోటీలో ఉంటారా నామినేషన్ ఉపసంహరించుకుంటారో వేచి చూడాలి.
Similar News
News October 13, 2025
విశాఖలో పీజీఆర్ఎస్‌కు 271 వినతులు

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలు పరిష్కారం చూపాలని కలెక్టర్ హరేంద్రప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టర్ వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 271 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ శాఖకు చెందినవి 82 ఉండగా, పోలీసు శాఖకు సంబంధించి 15, జీవీఎంసీ సంబంధించి 86 ఉన్నాయి. ఇతర విభాగాలకు సంబంధించి 88 వినతులు ఉన్నాయి.
News October 13, 2025
రేషన్ బియ్యం అక్రమాలకు చెక్: మంత్రి నాదెండ్ల

రేషన్ బియ్యం అక్రమాలకు చెక్ పెడుతున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇప్పటివరకూ 5.65 లక్షల క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నామని, 230 క్రిమినల్ కేసులు పెట్టామని తెలిపారు. విశాఖలో మూడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు. స్పాట్‌లోనే రేషన్ బియ్యం గుర్తించేందుకు మొబైల్ కిట్స్ ఉపయోగిస్తున్నామని, ఎరుపు రంగులోకి మారితే రేషన్ బియంగా గుర్తించి కేసులు నమోదు చేస్తామన్నారు.
News October 13, 2025
విశాఖ: ప్రభుత్వ కార్యాలయాల్లో నేడు PGRS

విశాఖ కలెక్టరేట్‌లో ఈనెల 13న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. అదే విధంగా సీపీ, జీవీఎంసీ ప్రధాన, జోనల్ కార్యాలయాల్లో కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వినతులు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.