News October 4, 2025
భీమిలిలో పేలిన మందుగుండు

విశాఖలో మందుగుండు పేలి ముగ్గురు యువకులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన ఇవాళ ఉదయం భీమిలి మండలం వలందపేటలో జరిగింది. దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రతిష్ఠించిన అమ్మవారి నిమజ్జనోత్సవంలో బాణసంచా కోసం మందుగుండు సామగ్రిని తీసుకొచ్చి తయారు చేస్తుండగా పేలింది. దీంతో మహేశ్, వాసు, కనకరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆరిలోవ ఆసుపత్రికి తరలించారు. సీఐ తిరుమలరావు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
Similar News
News October 4, 2025
విశాఖలో ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం ప్రారంభం

విశాఖ చిల్డ్రన్ ఏరినాలో ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి శనివారం ప్రారంభించారు. MLA వెలగపూడి రామకృష్ణ బాబు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 2.90 లక్షల డ్రైవర్లకు రూ.436 కోట్లు, విశాఖ జిల్లాలో 22,955 మందికి రూ.34.43 కోట్లు లబ్ధి అందనుందని మంత్రి డోలా పేర్కొన్నారు.
News October 4, 2025
విశాఖ అభివృద్ధికి వైసీపీ అడ్డంకి: గంటా

రాష్ట్ర అభివృద్ధిని వైసీపీ అడ్డుకుంటోందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. రూ.55 వేల కోట్ల పెట్టుబడితో విశాఖలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్‌ను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో తమ బినామీల భూములను కాపాడుకునేందుకే రైతుల పేరుతో కోర్టులో కేసులు వేస్తున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
News October 3, 2025
బినామీ భూముల కోసమే గూగుల్‌కు అడ్డు: పల్లా

విశాఖలో గూగుల్ ప్రాజెక్టును వైఎస్సార్సీపీ అడ్డుకుంటోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. జగన్ హయాంలో ఆక్రమించుకున్న బినామీ భూములను కాపాడుకోవడానికే రైతుల ముసుగులో కోర్టుకెళ్లి రూ.50,000 కోట్ల పెట్టుబడిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ కృషితో వస్తున్న ఈ ప్రాజెక్టును నిలిపివేసి, యువత భవిష్యత్తుతో వైఎస్సార్సీపీ రాజకీయాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు.