News March 30, 2024

భీమిలిలో రోడ్డు ప్రమాదం వివాహిత మృతి

image

మండలంలోని సంగివలస మూడు అమ్మవార్ల గుడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి చెందింది. అనకాపల్లికి చెందిన చంద్రతేజాదేవి (24)కి భీమిలి మండలానికి చెందిన గంగడ పైడిరాజుకి గత నెలలో వివాహం అయింది. వీరు మద్దిలపాలెంలో నివాసముంటున్నారు. ఈరోజు సింగనబంద అమ్మవారిని దర్శించుకుని బైక్‌‌పై తిరిగి వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొనడంతో అమె అక్కడికక్కడే మృతి చెందినట్లు భీమిలి సీఐ డీ.రమేశ్ తెలిపారు.

Similar News

News December 17, 2025

విశాఖలో పెరుగుతున్న విమాన ప్రయాణికుల రద్దీ

image

విశాఖ నుంచి విమానయాన ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఇక్కడి నుంచి రోజుకు 28 దేశీయ విమాన సర్వీసులు.. వారానికి 2 అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతిరోజూ సగటున 8,500-9,000 మంది ప్రయాణికులు విశాఖ విమానాశ్రయం ద్వారా ప్రయాణిస్తున్నట్లు గణాంకాలు కలవు. రాష్ట్ర ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖ నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఎయిర్‌ కనెక్టిటివీ అవసరం ఎంతైనా ఉంది.

News December 17, 2025

విశాఖలో 102 మంది ఎస్‌ల బదిలీ

image

విశాఖ పోలీస్ కమిషనర్ రేట్ పరిధిలో ఎస్‌ఐలను బదిలీ చేస్తూ సీపీ శంఖబత్రబాగి ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ స్టేషన్లో ఉన్న ట్రాఫిక్, క్రైమ్, శాంతి భద్రతల విభాగాలకు చెందిన 102 మంది ఎస్ఐలను బదిలీ చేశారు. మంగళవారం ఉదయం ఐదుగురు ఎస్ఐలను రేంజ్‌కు అప్పగించగా కొద్ది గంటల్లోనే భారీగా బదిలీలు జరిగాయి. వీరిలో ఎక్కువ కాలం ఒకే చోట పనిచేస్తున్న వారికి, ఇతర పరిపాలన కారణాలతో స్థానచలనం కల్పించారు.

News December 17, 2025

బతికున్నప్పుడే అన్నీ జరగాలి: అశోక్ గజపతి రాజు

image

ఎడ్యుసిటీ ఒప్పంద కార్యక్రమంలో అశోక్ గజపతి రాజు భావోద్వేగమయ్యారు. ‘మనం ఎప్పుడు చనిపోతామో చెప్పలేము.. బతికున్నప్పుడే సాధించాలి. నేను ఉన్నప్పుడే ఈ మంచి కార్యాలు జరగాలి. ప్రజలకు ఇంకా సేవ చేయాలి. నా తరువాత నా వారసులు ఆ పని కచ్చితంగా చేస్తారనే నమ్మకం నాకు ఉంది. మరిన్ని గొప్ప గొప్ప కార్యాలు చేసి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి. అందుకు మీ ఆశీస్సులు ఉండాలంటూ’ ఆయన మాట్లాడారు.