News September 19, 2024

భీమిలి: కూల్చివేతలపై స్టేకు హైకోర్టు నిరాకరణ

image

భీమిలి బీచ్‌లో MP విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి చేపట్టిన అక్రమ నిర్మాణాలన్నింటిని కూల్చివేయాలని జీవీఎంసీని హైకోర్టు ఆదేశించింది. కూల్చివేతలపై స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. రాజకీయ జోక్యంతో కూల్చివేతలను ఆపవద్దని సూచించింది. ఫొటోలను పరిశీలిస్తే బీచ్‌లోనే నిర్మాణాలు చేసినట్లు స్పష్టం అవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది.

Similar News

News March 2, 2026

విశాఖ: ప్రభుత్వ కార్యాలయాల్లో పీజీఆర్‌ఎస్

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అయితే గతవారం పీజీఆర్ఎస్ నిర్వహించలేదు.

News March 1, 2026

రేపు ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ

image

విశాఖలో ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం జరుగుతుంది. వినియోగదారులు 8688400499 నంబర్‌కు ఫోన్ చేసి సీఎండీ పృథ్వీతేజ్‌కి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. విద్యుత్ సరఫరా, కొత్త సర్వీసులు, ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యలపై ఫిర్యాదు చేసేవారు తమ సర్వీస్ నంబరును సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

News March 1, 2026

సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల సేకరణ: విశాఖ డీఈవో

image

జిల్లాలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సాధారణ సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలను సేకరించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ వెల్లడించారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్‌ కార్పొరేషన్ ఉపాధ్యాయుల్లో సీనియార్టీ జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. దీనిపై అభ్యంతరాలను 7వ తేదీలోగా తెలియజేయాలని కోరారు. గడువు దాటిన తర్వాత అభ్యంతరాలను స్వీకరించబోమని ఆయన స్పష్టం చేశారు.