News August 10, 2024

భీమిలి: పాఠశాల బస్సు ఢీకొని చిన్నారి మృతి

image

పాఠశాల బస్సు ఢీకొని బాలిక మృతి చెందిన ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. బంటుపల్లి ఆద్య(3) తండ్రి సురేష్ మజ్జిపేటలో నివాసం ఉంటున్నారు. రెడ్డిపల్లి జంక్షన్ వద్ద ఉన్న జ్ఞానజ్యోతి పాఠశాలలో బాలిక చదువుతోంది. సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చే క్రమంలో బస్సు దిగి వేగంగా రోడ్డు క్రాస్ చేస్తుండగా పాఠశాల బస్సు కిందే పడి చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News February 18, 2026

విశాఖలో అట్టహాసంగా ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ

image

విశాఖపట్నం తీరంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR-2026) లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. 20కి పైగా దేశాల నుంచి వచ్చిన 71 యుద్ధనౌకల గౌరవ వందనాన్ని ఆమె స్వీకరించారు. ‘సముద్రాల ద్వారా ఐక్యత’ (United Through Oceans) అనే థీమ్‌తో జరిగిన ఈ వేడుక దేశాల మధ్య నమ్మకాన్ని, గౌరవాన్ని ప్రతిబింబిస్తోందని, వివిధ దేశాల నావికుల కలయిక ప్రపంచ ఐక్యతకు నిదర్శనమని రాష్ట్రపతి కొనియాడారు.

News February 18, 2026

విశాఖ: ‘సముద్ర సంప్రదాయాల పట్ల ఐక్యతకు నిదర్శనం ఫ్లీట్ రివ్యూ’

image

అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీక్షించారు. ఈ కార్యక్రమం సముద్ర సంప్రదాయాల పట్ల దేశాల మధ్య ఉన్న ఐక్యత, గౌరవానికి చిహ్నమని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ దేశాల నౌకాదళాల సమిష్టి కృషి వల్ల సముద్ర మార్గాలు ప్రపంచాభివృద్ధికి, శ్రేయస్సుకు, మానవాళి సంక్షేమానికి కీలకమైన ద్వారాలుగా మారుతాయని రాష్ట్రపతి ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.

News February 18, 2026

విశాఖలో ఘనంగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ

image

విశాఖలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొని, 71 యుద్ధ నౌకల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. భారత నౌకాదళ శక్తిసామర్థ్యాలకు ఈ వేడుక ప్రతీకగా నిలిచింది.