News March 25, 2025

భీమిలి బీచ్‌లో నిర్మాణాల తొలగింపు

image

భీమిలి బీచ్‌లోని కోస్తా నియంత్రణ మండలి పరిధిలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కంపెనీ నిర్మించిన ప్రహరీ, వాటి పునాదుల తొలగింపునకు జీవీఎంసీ సుమారు రూ.కోటి వెచ్చిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటిని తొలగించి ఈ నెల 26 కల్లా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడంతో జీవీఎంసీ అధికారులు విరామం లేకుండా యంత్రాలతో పనిచేయిస్తున్నారు.

Similar News

News March 28, 2025

అమెరికాలో జనసేన ఆత్మీయ సమావేశం

image

అమెరికాలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు ఆధ్వర్యంలో శుక్రవారం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీ కృష్ణ పాల్గొన్నారు. జనసేన పార్టీ దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన పార్టీగా 100% స్ట్రైక్ రేట్‌తో ఘన విజయం సాధించిందన్నారు. వివిధ రంగాల్లో ఉన్న మేధావులు పార్టీ కోసం కృషి చేశారని కొనియాడారు. ఎన్డీఏ కూటమి బలోపేతానికి ఎన్ఆర్ఐ‌లు సహకారం అందించాలని కోరారు.

News March 28, 2025

కంచరపాలెంలో దారుణం.. ఒకరు మృతి

image

విశాఖలో దారుణం చోటుచేసుకుంది. ఎస్ఆర్‌ఆర్ నగర్‌కు చెందిన పి.హనుమంతురావు(60) మృతదేహం కలకలం రేపింది. చెట్టుకు నగ్నంగా కట్టేసి కొట్టడంతో అతను చనిపోయినట్లు సమాచారం. స్థానికులు చెట్టుకు కట్టేసి ఉన్న అతని మృతదేహాన్ని కిందకు దించి వస్త్రాలు కప్పారు. వారి సమాచారం మేరకు కంచరపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 28, 2025

ఇంట్లో పేకాట.. విశాఖలో 11 మంది అరెస్ట్ 

image

హెచ్‌బి కాలనీలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న వారిని ఎంవీపీ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.22,450 నగదు స్వాధీనం చేసుకున్నారు. 11 మందిపై కేసు నమోదు చేశారు. నగరంలో ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

error: Content is protected !!