News February 14, 2025
భీమిలి: స్వీట్ షాప్‌లో కుప్పకూలి మృతి

తగరపువలసలోని ఓ స్వీట్‌షాప్‌లో మహిళ మృతిచెందింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లికి చెందిన రక్షణకుమారి కొంతకాలంగా ఓ స్వీట్ షాప్‌లో పనిచేస్తోంది. గురువారం సాయంత్రం ఒంట్లో బాగోలేదని ట్యాబ్లెట్ వేసుకుని షాప్‌కి వెళ్లింది. అక్కడ పని చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు. భీమిలి పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 1, 2026
రేపు ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ

విశాఖలో ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం జరుగుతుంది. వినియోగదారులు 8688400499 నంబర్‌కు ఫోన్ చేసి సీఎండీ పృథ్వీతేజ్‌కి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. విద్యుత్ సరఫరా, కొత్త సర్వీసులు, ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యలపై ఫిర్యాదు చేసేవారు తమ సర్వీస్ నంబరును సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
News March 1, 2026
సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల సేకరణ: విశాఖ డీఈవో

జిల్లాలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సాధారణ సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలను సేకరించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ వెల్లడించారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్ ఉపాధ్యాయుల్లో సీనియార్టీ జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. దీనిపై అభ్యంతరాలను 7వ తేదీలోగా తెలియజేయాలని కోరారు. గడువు దాటిన తర్వాత అభ్యంతరాలను స్వీకరించబోమని ఆయన స్పష్టం చేశారు.
News March 1, 2026
విశాఖ: వెంకటాద్రి వంటిల్లు వద్ద యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ గేటు సమీపాన వెంకటాద్రి వంటిల్లు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. మలుపు తిరిగే సమయంలో ఎలక్ట్రికల్ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందింది. ఆటోలో ఉన్న భార్యాభర్తలు గాయపడడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న త్రీ టౌన్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు.


