News February 13, 2025
‘భీముని కొలను’ గురించి తెలుసా?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739344107520_60298897-normal-WIFI.webp)
పూర్వం పాండవులు శ్రీశైలం నల్లమల అడవుల్లో తీర్థయాత్రలు చేస్తుండగా ద్రౌపది దాహం తీర్చుకున్న కొలనే భీముని కొలనుగా ప్రసిద్ధి చెందింది. ద్రౌపది దాహంగా ఉందని చెప్పడంతో భీముడు చుట్టుపక్కల వెతికారని చరిత్ర చెబుతోంది. దాలోమశ మహర్షి ఒక శిలను చూపించి, పగులగొట్టమని చెప్పడంతో గదతో ఆ శిలను భీముడు పగులగొట్టగా నీటి ధారలు దూకాయట. భీముని కారణంగా ఏర్పడిన కొలను కావడంతో ‘భీముని కొలను‘ అనే పేరు వచ్చిందని అంటారు.
Similar News
News February 13, 2025
కర్నూలు జిల్లాకు ‘దామోదరం’ పేరు పెట్టాలి: వీహెచ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739420578068_727-normal-WIFI.webp)
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఏపీకి రెండో సీఎంగా ఆయన సేవలు అందించారని, తొలి దళిత ముఖ్యమంత్రి కూడా ఆయనే అని తెలిపారు. ఆయన సేవలను గుర్తించి జిల్లాకు దామోదరం పేరు పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడును కోరారు. కాగా సంజీవయ్య జిల్లాలోని కల్లూరు మండలం పెద్దపాడులో మునెయ్య, సుంకులమ్మ దంపతులకు 1921లో జన్మించిన విషయం తెలిసిందే.
News February 13, 2025
కర్నూలు జిల్లాలో ఉరేసుకుని వివాహిత మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739373094777_51804870-normal-WIFI.webp)
కర్నూలు జిల్లా పెద్ద తుంబలం గ్రామంలో విషాద ఘటన జరిగింది. 21ఏళ్ల వివాహిత అనూష ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అనూష, శాంతరాజును ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఈ క్రమంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా విషాదం నింపింది. అనూష మృతికి కుటుంబ ఆర్థిక సమస్యలు కారణమా? గృహ కలహాలా? లేక మరేదైనా కారణమా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
News February 13, 2025
కర్నూలు: టెన్త్ అర్హత.. 70 కంపెనీల్లో ఉద్యోగాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739363610813_50597895-normal-WIFI.webp)
ఆలూరులోని ఇబ్రహీం ఫంక్షన్ హాలులో ఈ నెల 20న మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు బహుజన టైమ్స్ సభ్యుడు దుర్గాప్రసాద్ తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లమా, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ చేసిన నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దాదాపు 70 కంపెనీల ప్రతినిధులు ఈ మేళాలో పాల్గొంటారని తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సహకారంతో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.