News November 13, 2025
భీమేశ్వరాలయంలో ఘనంగా కార్తీక దీపోత్సవం

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన భీమేశ్వర ఆలయంలో 22వ రోజు కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగింది. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఆలయ అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుహాసినులకు వాయినంగా పసుపు, కుంకుమ, గాజులు, స్వామివారి ఫొటోను అందజేశారు.
Similar News
News November 13, 2025
టెన్త్ పరీక్షలు అప్పుడేనా?

TGలో పదో తరగతి పరీక్షలు 2026 మార్చి 18(బుధవారం) నుంచి నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్‌ను ప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. ఇంటర్ పరీక్షలు అదే రోజు ముగియనుండగా టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభించేలా అధికారులు షెడ్యూల్ రూపొందించారు. ప్రభుత్వం ఆమోదిస్తే 2-3 రోజుల్లో షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. అటు టెన్త్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపు గడువును పొడిగించాలని TGHMA విద్యాశాఖను కోరింది.
News November 13, 2025
జరిమానా వేసే జీహెచ్ఎంసీకి కూడా జరిమానా

చెత్త, వ్యర్థాల నిర్వహణపై దుకాణదారులు, ప్రజలకు జరిమానా వేసే జీహెచ్ఎంసీకి కూడా జరిమానా పడింది. వేస్ట్ మేనేజ్‌మెంట్ సరిగా పాటించడం లేదంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.. జీహెచ్ఎంసీకి రూ.లక్ష ఫైన్ విధించింది. సిటీలో ఉత్పత్తి అయ్యే చెత్తను ఇష్టానుసారంగా జవహర్‌నగర్‌లో డంపింగ్ చేస్తున్నారంటూ పలువురు ఎన్జీటీని ఆశ్రయించగా ఈ చర్యలు తీసుకొంది. చెత్త నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలని ఆదేశించింది.
News November 13, 2025
దుగ్గిరాల పసుపు యార్డులో ధరలు ఇలా..!

దుగ్గిరాల యార్డు పసుపుకు పెట్టింది పేరు. అయితే పసుపు యార్డులో ధరలు బుధవారం జరిగిన వేలంలో ఈ విధంగా నమోదయ్యాయి. కొమ్ములు క్వింటాకు కనిష్ఠ ధర రూ.10,800, గరిష్ఠ ధర రూ.13,000, మోడల్ ధర రూ.12,550 పలికాయి. కాయ క్వింటాల్‌కు కనిష్ఠ ధర రూ.11,200, గరిష్ఠ ధర రూ.13,000, మోడల్ ధర రూ.11,800 పలకగా, మొత్తం 308 బస్తాల పసుపును రైతులు వ్యాపారులకు విక్రయించారని సిబ్బంది చెప్పారు.


