News February 13, 2026
భీమ్‌గల్: మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం!

భీమ్‌గల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. హోరాహోరీగా సాగిన పోరులో కాంగ్రెస్ 8 వార్డులను గెలుచుకుని మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 4 స్థానాలకే పరిమితమైంది. ఈ విజయంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొనగా, పట్టణ రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.
Similar News
News February 13, 2026
NZB: స్రవంతి రెడ్డికి (BJP) సర్టిఫికెట్ అందజేత

నిజామాబాద్ నగరంలోని 6వ డివిజన్‌లో గెలుపొందిన బీజేపీ అభ్యర్థి గోపిడి స్రవంతి రెడ్డికి ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రం అందజేశారు. కంఠేశ్వర్ ప్రాంతానికి చెందిన గోపిడి స్రవంతి రెడ్డిని బీజేపీ తరఫున మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. గత కార్పొరేషన్‌లో ఆమె బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా పని చేశారు.
News February 13, 2026
NZB: బీజేపీ మేయర్ అభ్యర్థి స్రవంతి రెడ్డి విజయం

నిజామాబాద్ నగరంలోని ఆరో డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి గోపిడి స్రవంతి రెడ్డి విజయం సాధించారు. కంఠేశ్వర్ ప్రాంతానికి చెందిన గోపిడి స్రవంతి రెడ్డి బీజేపీ మేయర్ అభ్యర్థిగా ఆరో డివిజన్ నుంచి పోటీ చేశారు. ప్రత్యర్థిపై మెజారిటీతో గెలుపొందారు. తనకు ఓటు వేసి గెలిపించిన వార్డు సభ్యులకు స్రవంతి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
News February 13, 2026
ఆర్మూర్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా

ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 36 వార్డులకు 19 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. స్పష్టమైన మెజారిటీని సాధించడంతో ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్: 19 వార్డులు
బీజేపీ: 7 వార్డులు
బీఆర్ఎస్: 5 వార్డులు
ఇతరులు/స్వతంత్రులు: 4 వార్డులు
MIM: 1
హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గ చూపారు.


