News February 27, 2025
భీమ్‌గల్: సాంబార్‌లో పడి చిన్నారి మృతి

వేడి సాంబార్‌లో చిన్నారి పడి మృతి చెందిన విషాద ఘటన భీమ్‌గల్‌లో చోటు చేసుకుంది. SI మహేశ్ వివరాల ప్రకారం.. భీమ్‌గల్‌కి చెందిన కర్నె చార్వీక్(3) తల్లి నిహరికతో ఈ నెల 19న ముచ్కూర్‌లోని బంధువుల శుభకార్యానికి వెళ్లాడు. అక్కడ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వేడి సాంబార్ పాత్రలో పడిపోయాడు. శరీరమంతా కాలిపోగా చిన్నారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు SI వివరించారు.
Similar News
News February 27, 2025
సిరిసిల్లలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన సిరిసిల్ల పట్టణంలోని చంద్రంపేటలో బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. సిరిసిల్ల పట్టణం చంద్రంపేటలో స్థానికులు గుర్తు తెలియని శవాన్ని గుర్తించారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 27, 2025
వట్లూరు పెద్ద చెరువులో స్నానానికి దిగి ఇద్దరు మృతి

పెదపాడు మండలం వట్లూరు గ్రామంలో గల పెద్ద చెరువులో ఇద్దరు వ్యక్తులు పడి గల్లంతైన విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన జుజ్జువరపు వెంకటేశ్వరరావు (58)చెరువులో మునిగిపోతున్న క్రమంలో.. కాపాడేందుకు యత్నించిన తమ్ముడి కుమారుడు సుబ్రహ్మణ్యం (32) మృతి చెందాడు. వారి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News February 27, 2025
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

రొద్దం మండల సమీపంలోని దొమ్మత మర్రివద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. గురువారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనంలో రెడ్డి పల్లి నుంచి లేపాక్షికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిని హిందూపురం ఆసుపత్రికి తరలించగా తిరుమలేశ్, భరత్ అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.