News January 14, 2025
భీమ్‌గల్: సెల్ఫీ వీడియోపై స్పందించిన ఎస్ఐ

భీమ్‌గల్ మండలం చేంగల్ గ్రామానికి చెందిన తక్కూరి నికేష్ సెల్ఫీ వీడియోపై ఎస్ఐ మహేశ్ స్పందించారు. అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా పలుమార్లు స్టేషన్‌కు పిలిచినా రాలేదన్నారు. తప్పించుకు తిరుగుతూ పోలీసులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరించారు. ఎవరి ప్రోద్బలంతో హింసించ లేదని, అతని ఆరోపణలు అవాస్తవమన్నారు. ఈ మేరకు ఎస్ఐ మహేశ్ ఓ ప్రకటనలో తెలిపారు.
Similar News
News November 14, 2025
NZB: జిల్లా కాంగ్రెస్ భవన్ లో నెహ్రు జయంతి వేడుకలు

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) భవన్‌లో శుక్రవారం భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు.
News November 14, 2025
వన్ వే సిస్టమ్‌ను పరిశీలించిన నిజామాబాద్ సీపీ

నిజామాబాద్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే దేవీ రోడ్డులో వన్ వే సిస్టమ్ అమలు పరిస్థితిని సీపీ సాయి చైతన్య స్వయంగా పరిశీలించారు. ప్రజలతో మమేకమై వన్‌వే అమలుతో కలుగుతున్న ప్రయోజనాలు, ఇబ్బందులు గురించి ప్రత్యక్షంగా ఆరా తీశారు. అదేవిధంగా పార్కింగ్ సౌకర్యాలు, బై లెన్లు, గంజ్-గాంధీచౌక్ ప్రాంతాల ట్రాఫిక్ రద్దీ వంటి అంశాలను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ వలీ పాల్గొన్నారు.
News November 13, 2025
భీమ్‌గల్: రూ.4 కోట్లతో టూరిజం గెస్ట్ హౌస్ నిర్మాణం

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చొరవతో భీమ్‌గల్ మండలం లింబాద్రి గుట్టలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అభివృద్ధి దిశగా మరో అడుగు పడింది. ఆలయ ప్రాంగణంలో రూ.4 కోట్ల వ్యయంతో టూరిజం గెస్ట్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకి మహేష్ కుమార్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.


