News March 27, 2025

భువనగిరిలో ఈనెల 28న ఇఫ్తార్ విందు

image

భువనగిరిలో ఈనెల 28న శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వైఎస్ఆర్ గార్డెన్‌లో ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు కూర వెంకటేశ్ తెలిపారు. ముస్లింలందరూ పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి మజహార్, నాయకుడు సలావుద్దీన్, ముస్లింలు పాల్గొన్నారు. 

Similar News

News September 19, 2025

వరి పంట నారుమడులను పరిశీలించిన కలెక్టర్

image

దువ్వూరు మండలంలో సాగు చేసిన వరి పంట నారుమడులను గురువారం కలెక్టర్ శ్రీధర్ పొలాలకు వెళ్లి నేరుగా పరిశీలించి రైతులతో మాట్లాడారు. పంటల సాగు పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విత్తనాలు, ఎరువులు అందుబాటుపై రైతులతో చర్చించారు. తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించేందుకు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలన్నారు. డిమాండ్, మార్కెట్ ఉన్న వాటిని సాగు చేయాలని సూచించారు.

News September 19, 2025

VKB: ‘మహిళలను మహిళా సంఘాల్లో చేర్పించాలి’

image

నిరుపేద మహిళలను మహిళా సంఘాల్లో 100% చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సుధీర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో మెప్మా సిబ్బంది, మహిళా సంఘాల రిసోర్స్ పర్సన్‌తో సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రుణాలు తీసుకున్న మహిళా సంఘాలు అభివృద్ధి దిశగా పయనించాలన్నారు.

News September 19, 2025

అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి: BHPL కలెక్టర్

image

అందరికీ విద్య, సౌకర్యాలు అందించడంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మంచినీరు, విద్యుత్, మరుగుదొడ్లు, మరమ్మతులు వంటి మౌలిక సదుపాయాల ఏర్పాటుపై పంచాయతీరాజ్, విద్యా, మహిళా సంక్షేమ, డీఆర్డీఓ, గిరిజన, టీజీడబ్ల్యూఐడీసీ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు.