News February 25, 2025
భువనగిరిలో మహిళా కానిస్టేబుల్ సూసైడ్

మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. భువనగిరిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరూకొలు గ్రామానికి చెందిన అనూష భువనగిరిలో నివాసం ఉంటున్నారు. తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News February 25, 2025
మాదిగ అమరవీరుల కుటుంబాల కాళ్లు కడిగిన మంత్రి రాజనర్సింహ

హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో జరుగుతున్న మాదిగ అమరవీరుల సంస్మరణ సభలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ కులాల్లో అసమానతల వల్లే ఆందోళనలు మొదలయ్యాయన్నారు. హక్కుల సాధన కోసం జరిగిన సుదీర్ఘ పోరాటంలో అసువులు బాసిన అమరులకు ఈరోజు నివాళులర్పిస్తున్నామన్నారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యుల కాళ్లు కడిగారు. ఈ సందర్భంగా వారికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.
News February 25, 2025
మార్చి 31లోపు LRS దరఖాస్తుల పరిష్కారం: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో LRS (లేఅవుట్ రెగ్యులరైజేషన్) దరఖాస్తులను మార్చి 31లోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మంగళవారం అధికారులను ఆదేశించారు. టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, నీటిపారుదల శాఖల సమన్వయంతో 14 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, పెండింగ్ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వ భూములు, కోర్టు కేసులు, బఫర్ జోన్ సమస్యలు లేని దరఖాస్తులను తక్షణమే ఆమోదించాలన్నారు.
News February 25, 2025
జీమెయిల్ లాగిన్‌కు త్వరలో క్యూఆర్ కోడ్ విధానం?

జీమెయిల్ లాగిన్‌కు సంబంధించి SMS కోడ్ స్థానంలో క్యూఆర్ కోడ్‌లను తీసుకురావాలని గూగుల్ యోచిస్తున్నట్లు సమాచారం. మెయిల్ సెక్యూరిటీ కోసం ప్రస్తుతం SMS బేస్డ్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను గూగుల్ అమలు చేస్తోంది. దీనితో పోలిస్తే క్యూఆర్ కోడ్ విధానం మరింత భద్రతనిస్తుందని సంస్థ భావిస్తోంది. ఈ కోడ్‌లను స్కాన్ చేయడానికి స్మార్ట్ ఫోన్లలోని కెమెరా యాప్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.