News February 24, 2025
భువనగిరి: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లిలో ఆదివారం జరిగింది. గ్రామస్థుల వివరాలిలా.. వీరారెడ్డిపల్లికి చెందిన మంద చంద్రయ్య అప్పుల బాధతో మనోవేదనకు గురై పంట పొలానికి తెచ్చిన పురుగు మందును తాగాడు. కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందాడు.
Similar News
News February 24, 2025
చిత్తూరు యువతి హీరోయిన్‌గా అరంగేట్రం

చిత్తూరు జిల్లాకు చెందిన సౌందర్య రవికుమార్ తమిళ చిత్రంలో తళుక్కుమన్నారు. నటన పట్ల ఆసక్తిగల సౌందర్య తన ప్రతిభతో గొప్ప అవకాశాన్ని దక్కించుకున్నారు. తమిళంలో దర్శకుడు గౌతమ్ మీనన్ అసిస్టెంట్ బాలు పులిచెర్ల దర్శకత్వంలో రూపొందుతున్న విక్రమ్ కే దాస్ చిత్రంలో సౌందర్య హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ కుమార్తె సౌందర్య చిన్ననాటి నుంచి కళల రంగంలో రాణిస్తోంది.
News February 24, 2025
వాల్తేరు డీఆర్‌ఎంగా లలిత్ బోహ్ర బాధ్యతల స్వీకరణ

వాల్తేరు డివిజన్ రైల్వే డీఆర్‌ఎంగా లలిత్ బోహ్ర సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ డీఆర్‌ఎంగా పని చేసిన సౌరబ్ కుమార్ ప్రసాద్ లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన విషయం తెలిసిందే. అయితే అతని స్థానంలో ఇప్పటి వరకు మనోజ్‌కుమార్ సాహు తాత్కాలిక డీఆర్ఎంగా వ్యవహారించారు.
News February 24, 2025
గుడిహత్నూర్: అత్తపై దాడి చేసిన అల్లుడు అరెస్ట్

అత్తపై గొడ్డలితో దాడి చేసిన అల్లుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ మహేందర్ తెలిపారు. గుడిహత్నూర్ మండలం కమలాపూర్ గ్రామంలో ఆదివారం వెంకటి(40) తన భార్యతో గొడవపడుతుండగా అతడి అత్త శశికళ మధ్యలోకి వెళ్లింది. దీంతో వెంకటి ఆమెపై గొడ్డలితో దాడి చేయడంతో మెడ భాగంలో తీవ్రగాయమైంది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు.