News April 15, 2025
భువనగిరి: ఆర్మీ ఉద్యోగాల భర్తీ: సాహితీ

సైన్యంలో వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితీ తెలిపారు. అర్హత, అసక్తి కలిగిన నిరుద్యోగ యువతీయువకులు ఈ నెల 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుకు విద్యార్హతల సర్టిఫికెట్లు తప్పనిసరిగా జతపర్చాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News February 26, 2026
గ్లోబల్ లీడర్‌గా మోదీ అరుదైన రికార్డు

ఇటు ఇజ్రాయెల్, అటు పాలస్తీనా.. పరస్పరం విరుద్ధమైన దేశాల నుంచి అత్యున్నత పురస్కారాలు అందుకున్న అరుదైన గ్లోబల్ లీడర్‌గా మోదీ నిలిచారు. తాజాగా ఇజ్రాయెల్ పార్లమెంటులో ‘స్పీకర్ ఆఫ్ ది క్నెసెట్ మెడల్’ను ప్రదానం చేశారు. 2018లో పాలస్తీనా ‘గ్రాండ్ కాలర్’తో సత్కరించింది. గొడవల్లో ఉన్న రెండు దేశాలను మెప్పించి ఇలాంటి గౌరవం పొందడం మోదీ దౌత్యనీతికి నిదర్శనమని విశ్లేషకులు కొనియాడుతున్నారు.
News February 26, 2026
రంపచోడవరం డీఎస్పీ బదిలీ

రంపచోడవరం డీఎస్పీ జి.సాయి ప్రశాంత్ బదిలీ అయ్యారు. 25మంది డీఎస్పీలను ప్రాధాన్యత లేని పోస్ట్‌లలో వేయాలని హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాల మేరకు వారిని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఇందులో రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ పేరు కూడా ఉంది. కాగా ఆ స్థానంలో ఎవరిని నియమిస్తారనేది పేర్కొనలేదు.
News February 26, 2026
యాదాద్రి: స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి తిరుకళ్యాణ మహోత్సవంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భక్తుల జయజయధ్వానాల మధ్య కళ్యాణ వేడుక అత్యంత వైభవంగా జరిగింది.


