News August 10, 2025
భువనగిరి: ‘ఆ రోజుల్లో సీపీఐ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు’

సీపీఐ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను ఈనెల 19 నుంచి 22 వరకు మేడ్చల్ జిల్లా గాజులరామారంలోని మహారాజ గార్డెన్స్‌లో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి తెలిపారు. ఆదివారం సీపీఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయం ఆవరణలో రాష్ట్ర 4వ మహాసభలకు సంబంధించిన గోడపత్రికలను జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. పార్టీ నాయకులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
Similar News
News August 13, 2025
పులివెందుల: 2 కేంద్రాల్లో రీపోలింగ్

AP: పులివెందుల ZPTC ఉప ఎన్నికల్లో భాగంగా 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎస్ఈసీ ఆదేశించింది. అచ్చవెల్లి, కొత్తపల్లెలో ఇవాళ రీపోలింగ్ నిర్వహించనున్నారు. 3, 14 కేంద్రాల్లో ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు రీపోలింగ్ జరగనుంది. ఈ కేంద్రాల్లో 2 వేల మంది ఓటర్లు ఉన్నారు. నిన్న జరిగిన పోలింగ్‌లో అవకతవకలు జరిగాయని మాజీ సీఎం జగన్, ఎంపీ అవినాశ్ సహా వైసీపీ శ్రేణులు ఆరోపించిన విషయం తెలిసిందే.
News August 13, 2025
VKB: 72 గంటలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

భారీ వర్షాలతో రాబోవు 72 గంటల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. వికారాబాద్ జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వాగులు, కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న చోట పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు ఉంటే కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయాలన్నారు.
News August 13, 2025
MHBD కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

భారీ వర్షాల నేపథ్యంలో మహబూబాబాద్ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో తెలిపారు. దీంతో జిల్లాలో ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ నెంబర్ 7995074803ను సంప్రదించాలని జిల్లా ప్రజలకు సూచించారు.