News January 31, 2025
భువనగిరి: ఇవాల్టి నుంచి ఇంగ్లిష్ ప్రాక్టికల్స్

ఇంటర్ విద్యార్థులకు ఇవాల్టి నుంచి ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 64 జూనియర్ కాలేజీలుండగా 14,400 మంది విద్యార్థులకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. విద్యార్థుల్లో ఆంగ్లంపై భయాన్ని తొలగించాలనే ఉద్దేశంతో విద్యార్థులు నిమిషం పాటు ఇంగ్లిష్ మాట్లాడాలనే నిబంధన పెట్టారు. తమకిష్టమైన ఏదో ఒక అంశంపై మాట్లాడే అవకాశం కల్పించినట్లు విద్యా అధికారులు చెప్పారు.
Similar News
News November 10, 2025
మెడికల్ కాలేజీల్లో ఫీజులు పెంచిన ప్రభుత్వం

AP: రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో పీజీ, యూజీ కోర్సుల ఫీజులను ప్రభుత్వం పెంచింది. 2020-23 బ్లాక్ పీరియడ్‌లో ఉన్న ఫీజుపై యూజీ కోర్సులకు 10%, సూపర్ స్పెషాలిటీ, పీజీ కోర్సులకు 15% పెంపునకు ఆమోదం తెలిపింది. హైకోర్టు, సుప్రీంకోర్టు తుదితీర్పులకు లోబడి ఇది ఉంటుందని వెల్లడించింది. రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీల్లో సూపర్ స్పెషాలిటీ కోర్సులకు రూ.17.25 లక్షలుగా ఫీజును నిర్ధారించింది.
News November 10, 2025
ఉమ్మడి నిజామాబాద్ ప్రజలకు అలర్ట్

రాష్ట్రంలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. ఈ నెల 11 నుంచి 19 వరకు ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిడ్‌కు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. అటు పొగమంచు ప్రభావం ఉంటుందని, వాహనదారులు నిదానంగా వెళ్లాలని సూచించారు. వృద్ధులు, చిన్నారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
News November 10, 2025
ఏలూరు: నేడు పీజీఆర్ఎస్‌కు కలెక్టర్ దూరం

ఏలూరు ప్రాంగణం గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ పాల్గొనరని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు ఆదివారం తెలిపారు. మొంథా తుఫాన్ కారణంగా ఏర్పడిన నష్టాన్ని పరిశీలించడానికి కేంద్ర బృందం వస్తున్న నేపథ్యంలో, ఆ బృందం వెంట కలెక్టర్, జేసీ ఉంటారని ఆయన వివరించారు.


