News March 28, 2024

భువనగిరి: ఎంపీ అభ్యర్థి చామల రాజకీయ నేపథ్యం ఇదే

image

భువనగిరి ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి స్వగ్రామం శాలిగౌరారం. యూత్ కాంగ్రెస్ రాజకీయాలతో రాజకీయ అరంగ్రేటం చేశారు. 2005లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, 2007లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాహుల్ గాంధీ కోటరీలో కీలకంగా వ్యవహరించారు. తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు.

Similar News

News January 10, 2025

NLG: భర్త బర్త్ డే.. అవయవదానంపై భార్య సంతకం

image

బర్త్ డే అయితే సాధారణంగా అన్నదానం, పండ్లు పంపిణీ లాంటి కార్యక్రమాలు చేస్తుంటాం. కానీ నల్గొండకు చెందిన శ్రీకాంత్, లహరి దంపతులు వినూత్నంగా ఆలోచించారు. జన్మదినం కావడంతో శ్రీకాంత్ నల్గొండ రెడ్ క్రాస్ భవన్‌లో రక్తదానం చేయగా, ఆయన భార్య లహరి అవయవ దానం ప్రతిజ్ఞ పత్రాలపై సంతకం చేశారు. వారిని రెడ్ క్రాస్ ఛైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి అభినందించారు. 

News January 10, 2025

నల్గొండ: ముగ్గును ముద్దాడిన వానరం 

image

మర్రిగూడ ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు ముందస్తుగా సంక్రాతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. విద్యార్థులు విభిన్న రంగులతో ముగ్గులు వేశారు. పాఠశాల ఆవరణం అంతా తీరొక్క రంగులతో మెరిసిపోయింది. అయితే అక్కడికి వచ్చిన ఓ వానరం ముగ్గులను ముద్దాడుతూ కనిపించింది. అక్కడున్న వారంతా ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ స్వరూప రాణి, సిబ్బంది పాల్గొన్నారు. 

News January 10, 2025

NLG: ఈ ఆలయాలకు వెళ్తున్నారా మీరు!

image

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉమ్మడి NLG జిల్లాల పరిధిలోని వైష్ణవ ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున రానున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ క్షేత్రాలైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి, సూర్యాపేట  శ్రీ వెంకటేశ్వర స్వామి, నల్గొండ సీతారామచంద్ర స్వామి, పానగల్లు ఛాయా సోమేశ్వర ఆలయాలతో పాటు వాడవాడలో ఉన్న వైష్ణవ ఆలయాల్లో నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.