News April 29, 2024

భువనగిరి ఎంపీ ఎన్నికల బరిలో 39 మంది అభ్యర్థులు

image

భువనగిరి పార్లమెంట్ స్థానానికి 51 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 12 మంది నామినేషన్లు సోమవారం ఉపసంహరించుకున్నారు. దీంతో భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో 39 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్యే ఇక్కడ పోటీ నెలకొని ఉంది. మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటు వేసి పట్టం కడతారో వేచి చూడాల్సి ఉంది.

Similar News

News November 14, 2025

NLG: యాసంగి ప్రణాళిక@6,57,229 ఎకరాలు

image

యాసంగి సాగు ప్రణాళికను NLG జిల్లా వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. గత యాసంగి సీజన్ లో వరి, ఇతర పంటలు కలిపి 6,49,712 ఎకరాల్లో రైతులు సాగు చేయగా.. ప్రస్తుత యాసంగి సీజన్‌లో 6,57,229 ఎకరాల్లో సాగు కానున్నట్లు వ్యవసాయశాఖ అంచనాలు వేసింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికలను రూపొందించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ తెలిపారు.

News November 13, 2025

విద్యార్థులను చూసి చలించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

image

మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం వద్ద ఆటోలో ప్రమాదకర స్థితిలో వెళ్తున్న మోడల్ స్కూల్ విద్యార్థులను చూసి చలించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆటోను ఆపి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల సమయానికి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేయాలని మిర్యాలగూడ ఆర్టీసీ డిపో అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎమ్మెల్యే స్పందన పట్ల స్థానిక ప్రజలు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

News November 13, 2025

ఐదుగురు వ్యక్తులు గ్రామస్థులతో కలిసి దాడి చేశారు: FRO

image

చందంపేట మండలం గువ్వలగుట్ట తండాలో నిన్న జరిగిన దాడిపై ఫారెస్ట్ రేంజ్ అధికారి భాస్కర్ గురువారం కీలక విషయాలు వెల్లడించారు. అటవీ భూమిలో సాగు చేస్తున్న గిరిజనులను హక్కు పత్రాలు చూపాలని కోరామన్నారు. కొన్నేళ్లుగా తాము సాగు చేసుకుంటున్నామని వాగ్వాదానికి దిగి ఐదుగురు వ్యక్తులు గ్రామస్థులతో కలిసి రాళ్ళు, కర్రలతో దాడి చేసి గాయపరిచారని చెప్పారు.