News February 26, 2025
భువనగిరి: ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం

భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలో 17 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.104 మంది పోలింగ్ సిబ్బందిని,17 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. 214 మంది పోలీసులను బందోబస్తు కోసం నియమించినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News February 26, 2025
అనకాపల్లి జిల్లాలో 24 పోలింగ్ కేంద్రాలు

ఈనెల 27న జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు అనకాపల్లి జిల్లాలో 24 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అనకాపల్లి జిల్లా ఎన్నికల అధికారి విజయకృష్ణన్ తెలిపారు. పోలింగ్ మెటీరియల్ కోసం ఎన్నికల అధికారులు సిబ్బంది 26న అనకాపల్లి జీవీఎంసీ మెయిన్ హైస్కూల్ లో హాజరు కావాలన్నారు. 10 బస్సులు ద్వారా పోలింగ్ సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు చేరవేస్తారని అన్నారు. పోలింగ్ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు జరుగుతుందన్నారు.
News February 26, 2025
నేడు ప్రధానితో సీఎం రేవంత్ భేటీ

ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సమావేశం కానున్నారు. అపాయింట్‌మెంట్ అందడంతో రేవంత్ నిన్న రాత్రి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. చివరిసారి గతేడాది జులైలో ఆయన పీఎంతో భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన SLBC ప్రమాదంపై మోదీ ఆరా తీసే అవకాశం ఉంది. అటు మూసీ సుందరీకరణ, శంషాబాద్ వరకు మెట్రోరైల్, RRR నిర్మాణం సహా విభజన చట్టంలోని పెండింగ్ పనులు, నిధులపై ప్రధానితో సీఎం చర్చించనున్నారు.
News February 26, 2025
జలవనరులను భద్రంగా నిల్వ చేసుకోవాలి: బాపట్ల కలెక్టర్

వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడకుండా అధికారులు జలవనరులను భద్రంగా నిల్వ చేసుకోవాలని కలెక్టర్ వెంకట మురళి ఆదేశించారు. జల వనరుల సంరక్షణ, సరఫరాపై అధికారులతో మంగళవారం బాపట్ల కలెక్టరేట్ నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. రానున్న వేసవి దృష్ట్యా ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని తాగునీటి చెరువులన్నింటినీ నూరు% నింపాలన్నారు.