News December 13, 2024
భువనగిరి ఒక్కటే మిగిలింది!

త్వరలో క్యాబినెట్ విస్తరణ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఉమ్మడి నల్గొండ నుంచి ప్రస్తుతం ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. నల్గొండ నుంచి కోమటిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి ఉత్తమ్ ఉన్నారు. ఈ లెక్కన నల్గొండ, సూర్యాపేట జిల్లాల నుంచి మంత్రి పదవి లభించినట్లైంది. ఇక భువనగిరి జిల్లా మాత్రమే మిగిలుండగా బెర్తు దక్కుతుందో లేదో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.
Similar News
News September 16, 2025
రేపు నల్గొండలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

నల్గొండలో పోలీస్ పరేడ్ మైదానంలో ఈ నెల 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ దినోత్సవాల సందర్భంగా ఉదయం 10 గంటలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.
News September 16, 2025
NLG: అమ్మకానికి ‘దొడ్డు’ బియ్యం

నల్గొండ జిల్లాలో మిగిలిపోయిన దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వం ఈ వేలం ద్వారా అమ్మకం చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 5,927 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం బియ్యాన్ని వేలం వేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కిలోకు రూ.24 చొప్పున ఈ వేలం ద్వారా విక్రయించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
News September 15, 2025
ఏడాదిలో 19 మందిపై పోక్సో కేసులో శిక్ష: నల్గొండ ఎస్పీ

గడిచిన సంవత్సరంలో నల్గొండ జిల్లాలో పోక్సో చట్టం కింద 18 కేసులలో 19 మంది నిందితులకు శిక్ష పడిందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. మైనర్ బాలికలపై అత్యాచారాలకు పాల్పడితే శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కేసులలో సకాలంలో సాక్ష్యాధారాలు సేకరించి, ఛార్జిషీట్ దాఖలు చేసి, నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.