News March 18, 2025
భువనగిరి: కలెక్టరేట్ వద్ద మహిళల బస

భువనగిరి కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్, సీఐటీయూ ఆధ్వర్యంలో తమ సమస్యను పరిష్కరించాలని 48 గంటల పాటు మహాధర్నా చేస్తున్నారు. నిరసనలో భాగంగా వంట వార్పు చేసుకుని రాత్రి అక్కడే బస చేశారు. కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద చుట్టూ పరదాలు కట్టుకొని అక్కడే తిని పడుకున్నారు. ఈ ధర్నా రేపు కూడా ఉంటుందన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నారు.
Similar News
News September 15, 2025
మైలవరంలో విద్యార్థుల మధ్య ఘర్షణ

మైలవరంలో సోమవారం కాలేజీ విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఆటలాడుతుండగా ఇద్దరు విద్యార్థుల మధ్య మొదలైన గొడవ, సీనియర్లు, జూనియర్ల మధ్య ఘర్షణకు దారితీసిందని స్థానికులు తెలిపారు. చిన్నగూడెం వద్ద రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. సీఐ చంద్రశేఖర్ ఘటనా స్థలానికి చేరుకోగా.. విద్యార్థులు పారిపోయారు. ఘర్షణ జరిగిన చోట ఉన్న 16 బైక్స్‌ను స్టేషన్‌కు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 15, 2025
కూకట్‌పల్లిలో రేణు అగర్వాల్ హత్య.. జైలుకు నిందితులు

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్‌లేక్ అపార్ట్‌మెంట్‌లో జరిగిన రేణు అగర్వాల్ హత్యకేసులో కీలక పరిణామం జరిగింది. రాంచీ నుంచి నిందితులు హర్ష, రోషన్, రాజ్ వర్మను పోలీసులు కూకట్‌పల్లికి తీసుకొచ్చారు. ట్రాన్సిట్ వారెంట్‌పై స్థానిక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించింది. కంది జైలుకు తరలించినట్లు సమాచారం.
News September 15, 2025
మెదక్: అట్టహాసంగా ఉమ్మడి జిల్లా కరాటే పోటీలు

పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి 14 సంవత్సరాలులోపు బాలబాలికలకు
కరాటే పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల నుంచి 85 మంది బాలురు, 75 మంది బాలికలు మొత్తం 160 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఎస్.జి.ఎఫ్ కార్యదర్శి నాగరాజు, పీఈటీల సంఘం కార్యదర్శి శ్రీనివాసరావు, శ్రీధర్ రెడ్డి, పీడీలు ప్రతాప్ సింగ్, మాధవా రెడ్డి, పూర్ణచందర్ ఉన్నారు.