News December 29, 2024
భువనగిరి: గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
గుండెపోటుతో ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. భువనగిరికి చెందిన దోసపాటి బాలరాజు (35) హైదరాబాద్ మొదటి బెటాలియన్ యూసఫ్‌గూడలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం సాయంత్రం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించగా ఆస్పత్రికి తరలిస్తుండటంతో మార్గ మధ్యలో చనిపోయారు. బాలరాజు మృతితో బెటాలియన్‌లో, కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News December 31, 2024
NLG: ‘బీజేపీ నుంచి భారతదేశాన్ని విముక్తి చేయాలి’
బీజేపీ నుంచి భారతదేశాన్ని విముక్తి చేయాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా పిలుపునిచ్చారు. సోమవారం సీపీఐ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా నల్గొండ ఎన్జీ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీతో పాటు కమ్యూనిస్టు పార్టీ కూడా పోరాటం చేసిందన్నారు. అదే స్ఫూర్తితో మతోన్మాధ బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు.
News December 30, 2024
NLG: అతడు అడవిని సృష్టించాడు
ఎకరం పొలం ఉంటే ఏం పంట వేద్దాం, ప్లాట్లు చేస్తే ఎంత లాభమొస్తది? అని లెక్కలేసుకొనే రోజులివి. కానీ, జాతీయ రహదారికి ఆనుకొని తనకున్న 70 ఎకరాల భూమిని చెట్లు పెంచేందుకు, మూగజీవాలకు ఆవాసంగా మార్చేశారో ప్రకృతి ప్రేమికుడు. జీవరాశులకు ఆహారం, నీళ్లు అందించాలన్న సదుద్దేశంతో రూ.కోట్ల విలువ చేసే భూమిని అడవిగా మార్చేశారు. ఆయనే.. జలసాధన సమితి పేరుతో నల్లగొండ ఫ్లోరైడ్ నీటి సమస్యపై పోరాడిన దుశ్చర్ల సత్యనారాయణ.
News December 30, 2024
పెద్దగట్టు జాతర.. ఐదు రోజుల కార్యక్రమాలు ఇవే..
రాష్ట్రంలోనే అతిపెద్ద రెండో జాతర దురాజ్‌పల్లి (పెద్దగట్టు) జాతర. ఈ జాతర ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు 5 రోజుల పాటు వైభవంగా జరగనుంది. మొదటి రోజు దేవరపెట్టే తరలింపు, 2వ రోజు కంకణ అలంకరణలు, 3వ రోజు స్వామివారి చంద్రపట్నం, 4వ రోజు దేవరపెట్టే కేసారం తరలింపు, 5వ రోజు మకరతోరణం తొలగింపుతో జాతర ముగుస్తుంది. ఇప్పటికే అధికారులు జాతరకు ఏర్పాట్లు చేస్తున్నారు.