News December 30, 2025

భువనగిరి: గ్రీవెన్స్‌ డే రద్దు

image

గురువారం జరగాల్సిన ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి రద్దయినట్లు కలెక్టర్ హనుమంతరావు వెల్లడించారు. నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వివిధ వర్గాల ప్రజలు, అధికారులు కలెక్టరేట్‌కు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. గురువారం ఫిర్యాదుల కోసం కార్యాలయానికి రావొద్దని ప్రజలను కోరారు. తదుపరి గ్రీవెన్స్ షెడ్యూల్‌ను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News January 9, 2026

జగిత్యాల: ‘కోర్టులు – పోలీస్ సమన్వయం అత్యవసరం’

image

న్యాయవ్యవస్థను ప్రజలకు వేగవంతంగా, పారదర్శకంగా అందించాలంటే కోర్టులు – పోలీస్ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి అన్నారు. జిల్లా కోర్టులో నిర్వహించిన కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో పెండింగ్ క్రిమినల్ కేసులు, చార్జ్‌షీట్ల దాఖలు, సమన్లు, ఎన్‌బీడబ్ల్యూ అమలు, సాక్షుల హాజరు వంటి అంశాలపై చర్చించారు. లోక్‌అదాలత్‌ ద్వారా 1051 కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు.

News January 9, 2026

ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల ప్రమాద బీమా: భట్టి

image

TG: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. ఇందుకోసం ప్రముఖ బ్యాంకర్లతో సంప్రదింపులు ముగిశాయన్నారు. ఇప్పటికే సింగరేణి, ట్రాన్స్‌కో, SPDCL, NPDCL, జెన్కో ఉద్యోగులకు రూ.కోటికి పైగా ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు చెప్పారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు.

News January 9, 2026

మెట్‌పల్లి: చైనా మాంజా పతంగులను విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు

image

చైనా మాంజ దారం కలిగిన పతంగులను విక్రయిస్తున్న మెట్‌పల్లి పట్టణానికి చెందిన షేక్ సిద్ధికి హుస్సేన్ (38)పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ శుక్రవారం తెలిపారు. చైనా మాంజా తగిలి పట్టణంలోని దుబ్బవాడలో జెట్టి లింగం మనమడు ఒడ్డెపు శ్రీయాన్ కు గాయాలు కాగా లింగం ఫిర్యాదు చేశాడన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.