News November 19, 2024

భువనగిరి: చెట్ల పొదల్లో యువకుడి మృతదేహం కలకలం

image

భువనగిరి పట్టణం నల్గొండ రోడ్లో నిర్మానుష్య ప్రాంతంలో ఓ యువకుడి మృతదేహం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించగా మృతుడు బిహార్‌కు చెందిన వలస కూలీ ఎండి శేష్మిఆలంగా గుర్తించారు. యువకుడిది హత్యేనని పోలీసులు భావిస్తున్నారు. భువనగిరిలో 4 ఏళ్ల నుంచి మృతుడు మెకానిక్‌గా పని చేస్తున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 23, 2026

గురుకుల ప్రవేశాల గడువు 25 వరకు పొడిగింపు

image

తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా బీసీ గురుకులాల ఆర్సీఓ స్వప్న తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

News January 23, 2026

నల్గొండ మీదుగా ‘అమృత్‌ భారత్‌’ రైలు

image

నల్గొండ మీదుగా మరో అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ అందుబాటులోకి రానుంది. HYD చర్లపల్లి నుంచి కేరళలోని తిరువనంతపురానికి నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్ల మీదుగా ఈ రైలు వెళ్లనుంది. వారంతపు సర్వీసుగా నడిచే ఈ రైలులో 11జనరల్‌, 8స్లీపర్‌ కోచ్‌లతో పాటు దివ్యాంగుల కోసం రెండు ప్రత్యేక బోగీలు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. తక్కువ ఛార్జీతో దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.

News January 23, 2026

NLG: మూగజీవాల దాహార్తిని తీర్చాలి: కలెక్టర్‌

image

వేసవిలో జంతువుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన SPCA సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎండల దృష్ట్యా పట్టణాలు, గ్రామాల్లో జంతువుల కోసం నీటి తొట్లు ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు. ఆవుల దత్తతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, పశువులకు నీడ, వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. అనంతరం గ్రామీణ పశు వైద్యులకు ఎండోస్కోప్‌ కిట్లను పంపిణీ చేసారు.