News March 15, 2026

భువనగిరి జిల్లాకు 190 యూనిట్లు మంజూరు: కలెక్టర్

image

షెడ్యూల్డ్ కులాల కార్యాచరణ ప్రణాళిక (2025-26) కింద జిల్లాకు 190 బ్యాంకు సంబంధిత యూనిట్లు మంజూరైనట్లు కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. రూ.382 లక్షలతో లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని శనివారం పేర్కొన్నారు. ఈ పథకానికి అర్హతగా గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉండాలని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

Similar News

News April 14, 2026

చంచల్‌గూడ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ మృతి

image

చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ బాణావత్ రాందాస్ మృతి చెందారు. ఆమనగల్లు మండలం సీతారాంనగర్ తండాకు చెందిన రాందాస్.. గత మార్చి 31న భార్య కవిత (28), కుమారుడు హర్షిత్‌ను హత్య చేశాడు. ఈ కేసులో అరెస్టై జైలుకు తరలించబడ్డాడు. జైలులో ఉండగా ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఈ ఘటనలో గాయాలు కావడంతో ఉస్మానియాకు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. ఈ విషయాన్ని సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు.

News April 14, 2026

రోజ్ గార్ యోజన.. లక్షల మందికి ఉద్యోగాలు

image

2021- 22 నుంచి 2025- 26 మధ్య HYDలో 7,23,932 మంది, రంగారెడ్డి జిల్లాలో 4,03,244 మందికి ఉద్యోగాలు లభించాయి. ఈ గణాంకాలు EPFO వద్ద నమోదయ్యాయి. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన పూర్తి వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. ఉపాధి అవకాశాలు పెరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం మరిన్ని ఉద్యోగాల సృష్టిపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.

News April 14, 2026

దేశంలో 16 మంది బీజేపీ సీఎంలు.. లిస్ట్ ఇదే

image

⋆ అస్సాం-హిమంత బిశ్వ శర్మ, అరుణాచల్‌ప్రదేశ్-పెమా ఖండూ
⋆ ఛత్తీస్‌గఢ్-విష్ణుదేవసాయ్, ఢిల్లీ-రేఖా గుప్తా
⋆ గోవా-ప్రమోద్ సావంత్, గుజరాత్-భూపేంద్ర పటేల్
⋆ హరియాణా-నాయబ్ సింగ్ సైనీ, UP-యోగి ఆదిత్యనాథ్
⋆ MP-మోహన్ యాదవ్, మహారాష్ట్ర-దేవేంద్ర ఫడణవీస్
⋆ మణిపుర్-యుమ్నాం ఖేమ్‌చంద్ సింగ్, ఉత్తరాఖండ్-పుష్కర్ సింగ్ ధామి
⋆ ఒడిశా-మోహన్ చరణ్ మాఝీ, త్రిపుర-మాణిక్ సాహా
⋆ రాజస్థాన్-భజన్‌లాల్ శర్మ, బిహార్-సామ్రాట్ చౌదరి