News March 16, 2025
భువనగిరి జిల్లాలో చికెన్ ధరలిలా..

భువనగిరి జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్(విత్ స్కిన్) కేజీ రూ.150-160 ఉండగా.. స్కిన్లెస్ కేజీ రూ.170-180 ధర పలుకుతోంది. అలాగే లైవ్ కోడి రూ.100-110 మధ్య ఉంది. కాగా, బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో గత నెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా, ప్రస్తుతం అమ్మకాలు పెరగాయని, ధర సైతం పెరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు.
Similar News
News March 16, 2025
సీసీటీవీ ఇన్స్టాలేషన్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

సీసీటీవీ ఇన్స్టాలేషన్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి హరికృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. బుక్కపట్నంలోని డిగ్రీ కళాశాలలో కోర్సులను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ, ఐటీఐ చదివిన వారు ఈ కోర్సులు నేర్చుకోవడానికి అర్హులు అన్నారు. ఆసక్తి కలవారు దరఖాస్తులు చేసుకోవాలని, మూడు నెలల శిక్షణానంతరం ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.
News March 16, 2025
డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం కృషి చేద్దాం

ఎస్ఎఫ్ఐ – డీవైఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో NCC గేట్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు 2కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. భగత్ సింగ్ స్ఫూర్తితో డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. డ్రగ్స్‌ను పారద్రోలి అసలైన భారతదేశాన్ని నిర్మిద్దామనే నినాదంతో యువజన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇందులో భాగంగానే ఈ రన్ నిర్వహించామన్నారు.
News March 16, 2025
శ్రీ సత్య సాయి జిల్లా: పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు

రేపటి నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలలో భాగంగా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ రత్నం పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల నుంచి 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్, నెట్ సెంటర్లను మూసివేయాలన్నారు. పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థులు జాగ్రత్తగా ప్రయాణం చేసి గమ్యస్థానానికి చేరుకోవాలన్నారు.