News January 31, 2025
భువనగిరి – నల్గొండ బైపాస్ వద్ద యాక్సిడెంట్

వరంగల్ – హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. భువనగిరి – నల్గొండ బైపాస్ ఫ్లైఓవర్ మీద జాతీయ రహదారిపై గుర్తుతెలియని వ్యక్తిని ఓ వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 వాహనంలో భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 11, 2026
సంక్రాంతి బరిలో మరో హీరో?

చాన్నాళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్ వచ్చే సంక్రాంతికి అదృష్టం పరీక్షించుకోనున్నట్లు తెలుస్తోంది. ‘ఆయ్’ ఫేమ్ అంజి డైరెక్షన్‌లో మూవీని ఓకే చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. టైటిల్‌తోనే పండుగ వైబ్ వచ్చేలా ‘సంక్రాంతి శుభాకాంక్షలు’ అనే పేరును లాక్ చేసినట్లు చర్చించుకుంటున్నాయి. అటు చిరు, బాలయ్య, వెంకీ, నాగ్‌తో పాటు శర్వానంద్, తేజా సజ్జ మూవీలు సంక్రాంతికి రిలీజ్ అవుతాయని టీటౌన్ వర్గాల మాట.
News February 11, 2026
రైల్వే సమస్యలను పరిష్కరించండి: ఎంపీ వినతి

జిల్లాలో నెలకొన్న రైల్వే సమస్యలను పరిష్కరించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఎంపీ నాగరాజు కోరారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో పాల్గొంటున్న ఆయన.. బుధవారం ఢిల్లీలోని మంత్రి కార్యాలయంలో కేంద్ర మంత్రిని కలిసి సమస్యలపై వినతిపత్రం అందించారు. కర్నూలు నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం వరకు కొత్త రైలు సర్వీసులను పెట్టడంతో పాటు ఇతర సర్వీసులను పొడిగించాలని కోరారు.
News February 11, 2026
VASTHU: స్మశానాలకు దగ్గర నివసించవచ్చా?

స్మశానాలకు దగ్గరగా నివసించడం శ్రేయస్కరం కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘స్మశానాల వద్ద జరిగే కార్యక్రమాలు నిరాశను, వైరాగ్యాన్ని కలిగిస్తాయి. అక్కడి గాలి అనారోగ్యానికి దారితీసే ప్రమాదం ఉంది. ఇది మనిషి శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. అందుకే నిలకడైన అభివృద్ధి కోసం ఇలాంటి ప్రదేశాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకోకపోవడమే ఉత్తమం’. అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>


