News March 16, 2025

భువనగిరి: నాలుగు రోజుల్లో పరీక్ష.. అంతలోనే ప్రమాదం

image

భువనగిరి మున్సిపాలిటీ రాయగిరిలో రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తల్లీకూతుర్లు రోడ్డు దాటుతుండగా బైక్ ఢీ కొట్టడంతో తల్లి మృతిచెందగా.. కూతురుకి గాయాలయ్యాయి. బాలిక పదోతరగతి చదువుతోంది. ఇంకో నాలుగు రోజుల్లో పరీక్షలు ఉండగా బాలికకు ప్రమాదం జరిగింది. ఆమెను భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిది కొలనుపాక కాగా రాయగిరికి వలస వచ్చారు.

Similar News

News March 16, 2025

అన్నమయ్య: చింత చెట్టుపై నుంచి పడి రైతు మృతి

image

చింతకాయలు కోయడానికి చెట్టు ఎక్కిన ఓ రైతు ప్రమాదవశాత్తు కింద పడి మృత్యువాత పడ్డాడు. ఆదివారం సాయంత్రం పీటీఎం మండలంలో వెలుగు చూసిన ఘటనపై మృతుని కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని కందుకూరు పంచాయతీ, గొడుగువారిపల్లికి చెందిన రైతు కొత్తోల్ల వెంకటరమణ(55) ఊరికి సమీపంలో ఉన్న చింతచెట్టు ఎక్కి కాయలు కోస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడి మృతి చెందాడని కుటుంబీకులు తెలిపారు.

News March 16, 2025

పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: కోనసీమ డీఈవో

image

అంబేడ్కర్ కొనసీమ జిల్లాలో సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.45 వరకు పరీక్షలు జరుగుతాయని డీఈవో సలీం భాషా ఆదివారం పేర్కొన్నారు. జిల్లాలో19,217 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని 110 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఓపెన్ స్కూలుకు సంబంధించి 1,160 మంది విద్యార్థులు కోసం 19 సెంటర్లు ఏర్పాటు చేసామన్నారు. జిల్లాలో ఐదు మొబైల్ స్క్వాడ్లు తనిఖీలు నిర్వహిస్తాయన్నారు.

News March 16, 2025

గ్రూప్-1 ఫలితాల్లో వారికి అన్యాయం: కవిత

image

TG: గ్రూప్-1 ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తుతున్న సందేహాలను ప్రభుత్వంతో పాటు TGPSC నివృత్తి చేయాలని BRS ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. పలు విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆమెను కలిసి చర్చించారు. పేపర్ వాల్యూయేషన్‌లో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందనే విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. గ్రూప్-2 ఫలితాల్లో 13వేల మందిని ఇన్వాలిడ్‌గా ఎలా ప్రకటించిందో చెప్పాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారన్నారు.

error: Content is protected !!