News March 13, 2025
భువనగిరి: ‘నీటి ఎద్దడికి తక్షణమే చర్యలు చేపట్టాలి’

భువనగిరి జిల్లాలో వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ గంగాధర్ ఆదేశించారు. సబ్కి యోజనా సబ్కా వికాస్‌లో భాగంగా జడ్పీ సీఈవో శోభారాణి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పంచాయితీ ప్లానింగ్ కమిటీ సమావేశానికి హాజరై మాట్లాడారు. నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్న గ్రామాలను ముందస్తుగా గుర్తించి ప్రణాళికబద్ధంగా మిషన్ భగీరథ నీటిని అందించాలన్నారు.
Similar News
News January 8, 2026
GNT: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం, ప్రేమ.. నిండు ప్రాణం బలి.!

తెనాలికి చెందిన 9వ తరగతి బాలిక అదే స్కూల్లో పదో తరగతి చదువుతున్న బాలుడితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై ప్రేమించుకోవడం, అతడి ఖర్చులకు తరచూ డబ్బులిస్తుండడం తెలిసిందే. గత నెల 31వ తేదీన న్యూ ఇయర్ వేడుకలకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో అతడు టీసీ తీసుకువెళ్తానని చెప్పగా ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ బుధవారం ఉదయం గుంటూరులో మృతి చెందింది. దీంతో పోలీసులు బాలుడిపై పోక్సో కేసును 306 కిందకు మార్చారు.
News January 8, 2026
రూ.4 వేల కోట్లతో వరంగల్‌లో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం!

వరంగల్ మహానగరం వరద ముంపులు లేని ప్రాంతంగా మారబోతుంది. రూ.4 వేల కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణానికి వారం రోజుల్లోపు టెండర్లు పిలవనున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడంతో పాటు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చిందని, వారం రోజుల్లో టెండర్లు పూర్తిచేసి సీఎం చేతుల మీదుగా పనులు ప్రారంభిస్తామన్నారు.
News January 8, 2026
‘అమెరికా సముద్రపు దొంగ’.. ఆయిల్ ట్యాంకర్ స్వాధీనంపై రష్యా ఫైర్

తమ ఆయిల్ ట్యాంకర్‌ను US స్వాధీనం చేసుకోవడంపై రష్యా నిప్పులు చెరిగింది. ఇది అంతర్జాతీయ సముద్ర చట్టాల ఉల్లంఘన అని, అగ్రరాజ్యం చేస్తోన్న Outright Piracy (సముద్రపు దొంగతనం) అంటూ ఆ దేశ రవాణా శాఖ మండిపడింది. ఐస్లాండ్ సమీపంలో తమ నౌకతో కాంటాక్ట్ కట్ అయిందని, అమెరికా చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని రష్యా సీనియర్ నేతలు హెచ్చరించారు. ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య కోల్డ్ వార్ మరింత ముదిరేలా కనిపిస్తోంది.


