News October 29, 2025
భువనగిరి: నేడు పాఠశాలలకు సెలవు

మొంథా ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండగా కలెక్టర్ హనుమంతరావు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఉదయం 8:48కి సెలవు ప్రకటన చేయగా అప్పటికే విద్యార్థులు, టీచర్లు స్కూళ్లకు వెళ్లారు. దీంతో అప్పటికే పాఠశాలలకు చేరుకున్న ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయుల నిర్ణయం మేరకు పాఠశాలను నడపాలని సూచించారు.
Similar News
News October 29, 2025
పాలమూరుకు వాతావరణ శాఖ అలెర్ట్… సెల్‌ఫోన్‌లకు సందేశాలు

రాబోయే 3 గంటల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ప్రజలకు సెల్‌ఫోన్‌లకు సందేశాల (SMS) ద్వారా అలెర్ట్ జారీ చేస్తోంది. మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని అంచనా వేస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
News October 29, 2025
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

సోమందేపల్లి(M) నల్లగొండ్రాయునిపల్లి వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. బెంగళూరులో ఉంటున్న గణేశ్ బంధువు మధుతో కలిసి బైకుపై రామగిరి(M) నసనకోట ముత్యాలమ్మ గుడికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వెలగమేకలపల్లికి చెందిన జగదీశ్ నాయక్ బైకుపై రోడ్డు దాటుతుండగా గణేశ్ బైక్ ఢీకొట్టాడు. గణేశ్ మృతిచెందగా, మధుకు కాలు విరిగింది. ఎస్సై రమేశ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
News October 29, 2025
LMD గేట్లను ఎత్తనున్న అధికారులు..!

కరీంనగర్ జిల్లా లోయరు మానేరు జలాశయం ఎల్ఎండీ గేట్లను ఎత్తనున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు రెండు గేట్లను ఎత్తి 4000 క్యూసెక్కుల నీటిని మానేరు వాగులోకి వదలనున్నట్లు చెప్పారు. మానేరు వాగు పరిసర ప్రాంతాల రైతులు, మత్స్యకారులు, పశువుల కాపరులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


