News October 27, 2025

భువనగిరి: నేడే మద్యం దుకాణాలకు లక్కీ డ్రా

image

భువనగిరి జిల్లాలో నూతన మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియను ఇవాళ నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,776 దరఖాస్తులు వచ్చాయి. రాయగిరిలోని సోమ రాధాకృష్ణ హాల్లో జిల్లా కలెక్టర్ హనుమంతరావు సమక్షంలో లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయించనున్నారు. దరఖాస్తుదారులు ఉదయం 9 గంటలలోపు తమ పాసులు, ఐడీ కార్డులతో హాలుకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

Similar News

News October 27, 2025

NGKL: వర్షాలకు నల్లబారుతున్న పత్తి.. దిగుబడి తగ్గే ప్రమాదం

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో 20 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తెల్ల బంగారం అని పిలిచే పత్తి నల్లబారుతోంది. కోతకు వచ్చిన పంట పొలాల్లోనే తడిసి ముద్దవడంతో, పత్తి తీయడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లా వ్యాప్తంగా 2.65 లక్షల ఎకరాలలో పత్తి సాగు అయిందని అధికారులు అంచనా వేశారు. ఈ వర్షాల కారణంగా జిల్లాలో పత్తి దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

News October 27, 2025

స్వగ్రామానికి చేరిన తల్లి, కూతురు మృతదేహాలు

image

కర్నూలు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన మంగ సంధ్యారాణి (43), ఆమె కుమార్తె చందన (23) మృతదేహాలు స్వగ్రామం మెదక్ మండలం శివాయిపల్లికి చేరాయి. డీఎన్ఏ పరీక్షల అనంతరం నిన్న సాయంత్రం కుటుంబీకులకు అప్పగించారు. భర్త ఆనంద్‌ గౌడ్ మృతదేహాలను తీసుకొచ్చారు. మృతదేహాలను చూసి కుటుంబసభ్యులు బోరున విలపించారు. ఈరోజు మధ్యాహ్నం అంత్యక్రియలు జరగనున్నాయి.

News October 27, 2025

త్వరలోనే మార్కాపురం కేంద్రంగా జిల్లా!

image

AP: పశ్చిమ ప్రకాశం ప్రజల చిరకాల కోరిక అయిన మార్కాపురం జిల్లా కల త్వరలోనే సాకారం కానుంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇవ్వగా, క్యాబినెట్ సబ్ కమిటీ కూడా జిల్లాను ప్రతిపాదించింది. దీంతో మార్కాపురం కేంద్రంగా కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం, దర్శి, మార్కాపురం నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. అటు కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం(D)లోకి తిరిగి చేర్చడంపై NOV 7న క్లారిటీ రానుంది.