News March 24, 2025
భువనగిరి: పది పరీక్షలకు 10 మంది డుమ్మా

భువనగిరి జిల్లాలో పది పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు DEO సత్యనారాయణ తెలిపారు. మూడవ రోజు ఇంగ్లీషు పరీక్ష 50 పరీక్ష కేంద్రాల్లో జరగగా ఆయన 4, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 20 పరీక్ష కేంద్రాలను సందర్శించామన్నారు. మొత్తం 8,618 విద్యార్థులకు 8,608 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. 10మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Similar News
News March 2, 2026
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. అనంతపురంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అనంతపురం జిల్లాలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. కలెక్టరేట్‌తోపాటు అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్లు RDO కార్యాలయాల్లో ఈ నంబర్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. యుద్ధ ప్రాంతాల్లో చిక్కుకున్న జిల్లా వాసుల సమాచారం కోసం బంధువులు 8500292992 నంబర్‌ను సంప్రదించవచ్చు.
★ అనంతపురం: 9493188818
★ కళ్యాణదుర్గం: 8309598111
★ గుంతకల్లు: 9866646648
News March 2, 2026
నిద్రలేవగానే కాళ్లు, చేతులూ వణుకుతున్నాయా?

నిద్రలేవగానే కొందరికి శరీరంలోని కండరాలు.. ముఖ్యంగా చేతులు, కాళ్లు వణికినట్టు అనిపిస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ పడిపోయినా, అతిగా కెఫిన్ (కాఫీ/టీ) తీసుకుంటున్నా, ఆందోళన/ఒత్తిడి ఎక్కువైనా, డీహైడ్రేషన్‌కు గురైనా ఇలా అనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణం కనిపిస్తే జాగ్రత్తలు తీసుకోవాలని.. అవసరమైతే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. సరిపడా నిద్రలేకపోయినా ఇలా అవుతుందని చెబుతున్నారు.
News March 2, 2026
కందికొండ శివారులో పెద్దపులి సంచారం..!

మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలంలోని కందికొండ శివారులో పెద్ద పులి సంచరించిన ఆనవాళ్లు కనిపించాయి. పంట చేలల్లో గుర్తించిన పులి పాద ముద్రలను అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా బయటకు వెళ్లవద్దని గ్రామస్థులకు సూచించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కాగా, ఇటీవల జనగామ జిల్లాలో సైతం సంచరించిన విషయం తెలిసిందే.


