News March 20, 2025
భువనగిరి: పర్యాటకానికి చేయూత

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న రీజినల్ రింగ్ రోడ్ చుట్టూ పర్యాటకుల కోసం వసతులు కల్పించనున్నట్లు తెలుస్తోంది. బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో యాదగిరిగుట్ట, భువనగిరి, కొలనుపాక, బస్వాపూర్, మహదేవపూర్ ప్రాంతాలను టూరిజం శాఖ ప్రత్యేక పర్యాటక కేంద్రాలుగా గుర్తించింది. దీంతో జిల్లా వాసులు హర్షిస్తున్నారు. కాగా చారిత్రక, ఆధ్యాత్మిక ఎకో టూరిజం కోసం నిధులు కేటాయించారు.
Similar News
News March 20, 2025
HYDలో బొట్టు పెట్టుకున్న విశ్వ సుందరి!

మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా బేగంపేటలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. మధ్యాహ్నం 12:00 గంటలకు హోటల్ టూరిజం ప్లాజాలో మిస్ వరల్డ్ –2025 ప్రీ-లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ సంప్రదాయంలో చీర కట్టు, బొట్టు పెట్టుకొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ‘నమస్తే ఇండియా’ అని పలకరించి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక్కడి ట్రెడిషన్ చాలా బాగా నచ్చింది అంటూ కితాబిచ్చారు.
News March 20, 2025
కర్ణాటకలో ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ ఛార్జీల పెంపు

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచనున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలపై భారం మోపడం సరికాదని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.