News April 8, 2025
భువనగిరి: పెరిగిన గ్యాస్ ధరలు.. రూ.1.25 కోట్ల భారం !

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. సిలిండర్ ప్రస్తుతం రూ.853 ఉండగా పెరిగిన ధరతో రూ.903కు చేరింది. యాదాద్రి జిల్లాలో 2,49,568 గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. దీంతో గ్యాస్ వినియోగదారులపై సుమారు రూ. 1.25 కోట్ల భారం పడనుంది. ఇది ఉజ్వల పథకం సిలిండర్లకు మాత్రమే వర్తించనుంది. నిత్యావసరాల ధరలు పెరిగిన వేళ.. గ్యాస్ ధర పెరగడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.
Similar News
News April 18, 2025
ASF జిల్లాలో 8 మందిపై కేసు: వాంకిడి SI

మహారాష్ట్ర నుంచి రాజురాంపల్లికు పశువులను అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై ప్రశాంత్ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు వాంకిడి మండలం అకిని సమీపంలో బుధవారం తనిఖీలు నిర్వహించగా అనుమతులు లేకుండా 4 బులెరో వాహనాల్లో 8 పశువులను తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. పశువులను కాగజ్‌నగర్ గోశాలకు తరలించామన్నారు. 8 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రశాంత్ పేర్కొన్నారు.
News April 18, 2025
నారాయణపేట: GREAT.. ఫ్రెండ్స్ అంటే వీళ్లే..!

నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రానికి చెందిన వడ్ల బాలరాజు గత నెలలో మృతిచెందాడు. పేద కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో బాలరాజు మిత్ర బృందం వారికి సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. అంతా కలిసి రూ.1.50లక్షలు జమ చేసి బాలరాజు భార్యకు గురువారం రాత్రి అందించారు. ఫ్రెండ్స్ అంతా కలిసి స్నేహితుడి కుటుంబానికి చేయూతనివ్వడంతో గ్రామస్థులు వారిని అభినందించారు.ఆపద సమయంలో అండగా ఉన్నవారే నిజమైన దోస్తులని అన్నారు.
News April 18, 2025
ADB: విద్యార్థులు SPORTS ట్రైనింగ్‌కి సిద్ధం కండి

సమ్మర్ క్యాంప్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా కలెక్టరేట్ ఛాంబర్లో వేసవి శిక్షణ శిబిరం పోస్టర్‌ను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మే 1 నుంచి 31 వరకు శిబిరాలు కొనసాగుతాయన్నారు. 6 నుంచి 14 ఏళ్ల బాలబాలికలు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.