News March 20, 2025

భువనగిరి: ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు..

image

జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజు జరిగిన కెమిస్ట్రీ, వాణిజ్య శాస్త్రం పరీక్షలకు 6,395 మంది విద్యార్థులకు గాను 6,035 మంది హాజరయ్యారు. 360 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ రమణి తెలిపారు. పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఉత్సాహంగా కనిపించారు. హాస్టళ్లు, అద్దె ఇళ్లలో ఉంటున్న విద్యార్థులు స్వగ్రామాలకు బాటపట్టారు. దీంతో భువనగిరి ఆర్టీసీ బస్టాండ్ రద్దీగా కనిపించింది.

Similar News

News September 18, 2025

అరాచకమే.. సందీప్ వంగాతో మహేశ్ మూవీ?

image

రాజమౌళితో సినిమా తర్వాత మహేశ్ బాబు చేసే మూవీ విషయమై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీని కోసం మైత్రీ మూవీ మేకర్స్, ఏషియన్ సునీల్ పోటీలో ఉన్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో మూవీ చేయాలని మహేశ్‌ను సునీల్ కోరినట్లు తెలిపాయి. కాల్షీట్ల ఆధారంగా దీనిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందన్నాయి. దీంతో సందీప్, మహేశ్ కాంబినేషన్ కుదిరితే అరాచకమేనని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.

News September 18, 2025

పూసపాటిరేగ: వేటకు వెళ్లి మృతి

image

పూసపాటిరేగ మండలం పెద్దూరుకు చెందిన ఓ మత్స్యకారుడు వేటకు వెళ్లి మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మత్స్యకారుడైన బి.రాము బుధవారం వేటకు వెళ్లగా.. చేపల కోసం వల వేసే క్రమంలో జారి పడిపోయాడు. అక్కడున్నవారు కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఈ ఘటనపై మెరైన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News September 18, 2025

ప్రకాశం ఎస్పీ గారూ.. ప్లీజ్ ఈవ్ టీజింగ్‌పై లుక్కేయండి!

image

ప్రకాశం జిల్లా నూతన SP హర్షవర్ధన్ రాజు ఇటీవల బాధ్యతలు చేపట్టారు. తిరుపతిలో SPగా ఉన్నప్పుడు ఈవ్ టీజింగ్‌పై ఉక్కుపాదం మోపారు. ఇప్పుడు ప్రకాశంలో కూడా అదే తీరు చూపాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. స్కూల్స్, కళాశాలలు మొదలు, ముగిసే సమయాల్లో పోకిరీల ఆగడాలు పెరిగాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. SP చొరవ తీసుకోవాలని వారు కోరారు.