News February 9, 2025

భువనగిరి: భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ రద్దు

image

భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను నేటి నుంచి 20వ తేదీ వరకు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ నుంచి కాజీపేట వరకు ప్రయాణించే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట – ఖమ్మం – విజయవాడ మధ్య మూడో ట్రాక్ లైన్ పనుల కారణంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు, ప్రజలు గమనించగలరని కోరారు.

Similar News

News November 5, 2025

విశాఖ: కనెక్షన్ కావాలంటే చేయి తడపాల్సిందే

image

GVMC పరిధిలో తాగునీటి కనెక్షన్ల ఏర్పాటుకు సిబ్బంది అనధికారంగా కలెక్షన్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కనెక్షన్ పొందాలంటే కేవలం దరఖాస్తు పెడితేనే సరిపోదని, సంబంధిత అధికారి చేయి తడపాల్సివస్తోందంటున్నారు. గ్రూప్‌హౌస్‌లు, అపార్ట్‌మెంట్లు, వ్యాపార సముదాయాలు ఇలా ఒక్కో బిల్డింగ్‌కు ఒక్కో రేటు ఫిక్స్ చేశారు. అడిగినంత ఇవ్వకుంటే కొర్రీలు పెడుతూ తిప్పించుకుంటున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News November 5, 2025

ఎన్టీఆర్ ఊర మాస్ లుక్

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త లుక్ ఆకట్టుకుంటోంది. ఇవాళ ఆయన హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయటకొచ్చిన ఫొటోలు వైరలవుతున్నాయి. ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్‌ తీస్తోన్న మూవీ షూట్‌లో బిజీగా ఉంటున్నారు. ఈ సినిమా కోసం ఆయన చాలా బరువు తగ్గడంపై అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఈ బియర్డ్ లుక్‌లో NTR హ్యాండ్సమ్‌గా ఉన్నారని, ‘డ్రాగన్’ మూవీ లుక్ ఇలానే ఉంటుందా? అంటూ పోస్టులు చేస్తున్నారు. తారక్ లుక్ ఎలా ఉంది? COMMENT

News November 5, 2025

సమాజ అవసరాలకు అనుగుణంగా విజన్: CBN

image

సమష్టి బాధ్యతతో అధికారులు, పారిశ్రామికవేత్తలు భవిష్యత్తరాలకు సరైన మార్గన్ని నిర్దేశించాల్సిన అవసరముందని CM CBN పేర్కొన్నారు. ప్రపంచం, సమాజ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వాలు, సంస్థలు తమ విజన్‌ను రూపొందించుకోవాలని సూచించారు. నూతన సాంకేతికతతో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి సరైన ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. తన సతీమణికి యూకే డిస్టింగ్విష్ ఫెలోషిప్-2025 అవార్డు అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.