News September 20, 2025

భువనగిరి: భార్యను నరికి చంపిన భర్త

image

మోత్కూర్: అడ్డగూడూరుకు చెందిన శంకర్ తన భార్య మంజులను HYDలో కత్తితో నరికి చంపాడు. పోలీసుల కథనం ప్రకారం.. 4 రోజుల క్రితం శంకర్ తన ఫ్యామిలీతో కలిసి కుషాయిగూడ మహేశ్ నగర్ కాలనీలో ఉంటున్న సోదరి ఇంటికి వెళ్లారు. శుక్రవారం అర్ధరాత్రి అందరూ నిద్రపోయాక తన భార్యను కత్తితో హత్యచేసి పరారయ్యాడు. దంపతులకు కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News September 20, 2025

‘చపాతీ, పరోటాలపై లేని GST.. ఇడ్లీ, దోశలపై ఎందుకు’

image

చపాతీ, పరోటాలపై పన్నును 18 నుంచి 0%కు తగ్గించిన జీఎస్టీ కౌన్సిల్ ఇడ్లీ, దోశలను యథావిధిగా 5% పరిధిలోనే ఉంచడం విమర్శలకు దారితీస్తోంది. ఇవి ఎక్కువగా దక్షిణాది వాళ్లే తింటారు. దీంతో ఉత్తరాది అల్పాహారాలపై పన్ను తీసేసి ఇక్కడి వంటకాలపై వివక్ష చూపుతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలో MLA రామకృష్ణ దీన్ని ప్రస్తావించడాన్ని గుర్తు చేస్తున్నారు.

News September 20, 2025

ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది: ఎస్వీ మోహన్ రెడ్డి

image

సీఎం చంద్రబాబు సర్కార్ అసెంబ్లీ సాక్షిగా ఉల్లి రైతులను మోసం చేస్తోందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. శనివారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ.. రెండున్నర ఎకరాలకు రూ.50 వేలు ఇస్తామని చెప్పడం దారుణమన్నారు. మార్కెట్‌కి తెచ్చిన ఉల్లి పంటను మీరే అమ్ముకోవాలని, రూ.1,200ల మద్దతు ధరను సైతం నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం రైతులను దగా చేయడం కాదా? అని ప్రశ్నించారు.

News September 20, 2025

‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం

image

AP: పల్నాడు జిల్లా మాచర్లలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొని పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెరువు వద్ద చెత్త ఊడ్చారు. వారితో కాసేపు మాట్లాడారు. స్వచ్ఛరథం వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.2కోట్ల చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ప్రజావేదిక బహిరంగ సభలో పాల్గొని మార్గదర్శి-బంగారు కుటుంబాల సభ్యులతో సమావేశం కానున్నారు.