News March 4, 2025

భువనగిరి: మంత్రిని కలిసిన బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు

image

హైదరాబాదులో బిల్డర్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సమస్యలను మంత్రికి విన్నవించుకున్నారు. CM రేవంత్ రెడ్డితో చర్చించి.. చిన్న కాంట్రాక్టర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లుల సమస్యను పరిష్కరిస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులకు హామీ ఇచ్చారన్నారు. రూ.100 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

Similar News

News March 4, 2025

వేలం తొలి రౌండ్‌లో అన్‌సోల్డ్.. ఇప్పుడు కెప్టెన్

image

IPL టీమ్ కేకేఆర్ తమ జట్టు కెప్టెన్‌గా అజింక్యా రహానేను నియమించింది. కాగా దుబాయ్‌లో జరిగిన మెగా వేలంలో రహానేను తొలుత ఎవరూ కొనుగోలు చేయలేదు. కనీస ధర రూ.కోటికి కూడా అతడిని సొంతం చేసుకోవడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. రహానే నిదానమైన ఆట IPLకు సరిపోవడం లేదని ఎవరూ అతడిని కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. ఆ తర్వాత జరిగిన యాక్సలరేటెడ్ రౌండ్‌లో ఆయనను KKR రూ.1.50 కోట్లతో దక్కించుకుని కెప్టెన్సీ అప్పగించింది.

News March 4, 2025

సంగారెడ్డి: ఇంటర్ పరీక్షలకు ప్రత్యేక బస్సులు

image

సంగారెడ్డి జిల్లాలో రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. పటాన్‌చెరు, సంగారెడ్డి, సదాశివపేట, జోగిపేట మార్గాల్లో ఈ బస్సులు నడుపుతామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News March 4, 2025

పేదరిక జిల్లాగా ఉమ్మడి అనంతపురం

image

సోషియో ఎకనామిక్ సర్వే తెలిపిన లెక్కల ప్రకారం రాష్ట్రంలోనే అత్యంత పేద జిల్లాల లిస్ట్‌లో అనంతపురం జిల్లా 6వ స్థానంలో ఉంది. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం నిన్న సోషియో ఎకనామిక్ సర్వే ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సర్వే ప్రకారం గిరిజనులు నివసించే అన్ని ప్రాంతాల్లో పేదరికం ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. కాగా అత్యంత పేదరిక జిల్లాగా మొదటి స్థానంలో ఉమ్మడి కర్నూలు జిల్లా నిలిచింది.

error: Content is protected !!