News October 3, 2025
భువనగిరి: మద్యం దుకాణాలకు ఎన్ని దరఖాస్తులంటే..

జిల్లాలో మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ సాగుతోంది. జిల్లాలో 82 మద్యం దుకాణాలకు గత నెల 26 నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు .26వ తేదీ నుంచి నేటి వరకు 62 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం నాలుగు స్టేషన్లకు భువనగిరి 24, రామన్నపేట13, ఆలేరు 20, మోత్కూరు 10 వచ్చినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ విష్ణుమూర్తి తెలిపారు. ఈనెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
Similar News
News October 3, 2025
కొడంగల్: వక్ఫ్ బోర్డు మెంబర్ నివాసంలో సీఎం

సీఎం రేవంత్ రెడ్డి విజయదశమి పండుగను పురస్కరించుకొని శుక్రవారం కొడంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, వక్ఫ్ బోర్డు మెంబర్ యూసుఫ్ నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు సీఎం హాజరయ్యారు. అక్కడున్న వారిని ఆప్యాయంగా పలకరించారు. సీఎంతో పాటు ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, స్థానికులు ముస్తాక్, బషీర్, ఆసిఫ్‌ఖాన్ ఉన్నారు.
News October 3, 2025
646 ఉద్యోగాలకు నోటిఫికేషన్

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(C-DAC)లో 646 ఉద్యోగాలకు(కాంట్రాక్ట్) నోటిఫికేషన్ వెలువడింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నోయిడా, పుణే తదితర బ్రాంచ్‌లలో మేనేజర్, ప్రాజెక్ట్ అసోసియేట్, ఇతర పోస్టులున్నాయి. జాబ్‌ను బట్టి B.Tech/B.E, M.E/M.Tech, MCA, M.Phil/Ph.D చేసిన వారు అర్హులు. దరఖాస్తుకు చివరి తేదీ OCT 20. వెబ్‌సైట్: <
News October 3, 2025
దసరా.. రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు

TG: దసరాకు ఈసారి మద్యం అమ్మకాలు భారీగా జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నిన్న గాంధీ జయంతి కావడంతో షాపులు మూసివేయగా సెప్టెంబర్ 30, అక్టోబర్ 1న మొత్తం రూ.419 కోట్ల అమ్మకాలు జరిగాయన్నారు. ఇందులో SEP 30నే రూ.333 కోట్ల మద్యం అమ్ముడుపోయినట్లు పేర్కొన్నారు. ఈ నెల 1న రూ.86 కోట్ల సేల్స్ జరిగాయని వెల్లడించారు. సాధారణంతో పోలిస్తే సెప్టెంబర్ 26 నుంచి అమ్మకాలు రెట్టింపయ్యాయని వెల్లడించారు.