News July 14, 2024
భువనగిరి: మహిళపై గొడ్డలితో దాడి

మహిళపై గొడ్డలితో దాడి చేసిన ఘటన నారాయణపురం(M) వాయిల్లపల్లిలో జరిగింది. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన సుభాశ్ భూమి పక్కన చెన్నకేశవ, మారయ్య, లింగస్వామి, ఎర్రయ్యల భూమి ఉంది. కొద్ది రోజులుగా సుభాశ్ ఫెన్సింగ్ వేసుకున్న భూమిలో అర ఎకరం భూమి తమదంటూ గొడవ పడుతున్నారు. శనివారం ఫెన్సింగ్ కడ్డీలను ధ్వంసం చేసే సమయంలో సుభాశ్ భార్య అడ్డుకునేందుకు వెళ్లగా పద్మపై నలుగురు గొడ్డలితో దాడి చేశారు. కేసు నమోదైంది.
Similar News
News November 11, 2025
NLG: వానాకాలం ధాన్యం సేకరణపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

వానాకాలం ధాన్యం సేకరణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె ధాన్యం సేకరణపై సంబంధిత శాఖల అధికారులు, తహశీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, నవంబర్, డిసెంబర్ మొదటి వారం వరకు జిల్లాలో కొనుగోలు కేంద్రాలకు పెద్ద ఎత్తున ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు.
News November 11, 2025
నల్గొండ: 4 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు అందని వేతనాలు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నాలుగు నెలలుగా జీతాలు అందడం లేదు. దీంతో అప్పులు చేయాల్సి వస్తుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని 1,781 గ్రామ పంచాయతీలను నిధుల కొరత వేధిస్తోంది. అభివృద్ధి సంగతి అటు ఉంచితే.. కనీసం జీతాలు, జీపీల మెయింటెనెన్స్ లాంటి పనులకు కూడా తీవ్ర ఆటంకం కలుగుతుందని గ్రామస్థులు తెలిపారు.
News November 11, 2025
NLG: 50% సిలబస్ ఇంకా అలానే..!

ఇంటర్ సిలబస్ పూర్తికాక విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 140 ఉన్నాయి. వాటిలో 12,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు కొన్ని కాలేజీల్లో 50% సిలబస్ కూడా పూర్తి కాలేదని తెలుస్తుంది. ఐదు నెలల్లో కేవలం 50 శాతం మాత్రమే సిలబస్ పూర్తి అయింది.


